హై హిల్స్ చెప్పులను ఎక్కువసేపు వేసుకుంటే మడమల నొప్పులు (Heel pains) వస్తాయి. ఎత్తయిన చెప్పులను ఎక్కువసేపు వేసుకొని నడవడం, నిలబడ్డం చేయడంతో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి (Low back pain) వచ్చే అవకాశాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కొన్ని ఎత్తైన చెప్పుల కారణంగా మునివేళ్ల మీద అధిక ఒత్తిడి పడడంతో బొటనవేలు వంకర పోవడం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ మడమలు అరిగిపోవడం జరుగుతాయి.