మందును కొంచెం తాగినా డేంజరేనా?

Published : Jun 06, 2023, 10:41 AM ISTUpdated : Jun 06, 2023, 10:43 AM IST

మందును మితంగా తాగితే ఎలాంటి  సమస్య రాదనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ కొన్ని అధ్యయనాలు మాత్రం ఇది కూడా క్యాన్సర్ నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుందని వెళ్లడిస్తున్నాయి. 

PREV
18
మందును కొంచెం తాగినా డేంజరేనా?

మందును తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. కొంతమంది ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగుతుంటారు. ఇంకొందరు వారానికి లేదా నెలకోసారి తాగితే కొందరు మాత్రం రోజూ తాగుంతుంటారు. స్టాటిస్టా ప్రకారం.. 2020లో భారతదేశంలో ఆల్కహాల్ వినియోగం దాదాపు ఐదు బిలియన్ లీటర్లకు చేరుకుంది. అలాగే ఇది 2024 నాటికి దాదాపు 6.21 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. కానీ మందు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు.. మందుతో వచ్చే ప్రమాదాలను తొలగించడానికి ఎంతో కృషి చేస్తున్నాయి.
 

28

తక్కువ తాగితే సురక్షితమేనా? 

2023 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అధికారిక ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురితమైన డబ్ల్యూహెచ్ఓ అధికారిక ప్రకటన ప్రకారం.. మద్యపానం విషయానికొస్తే ఆరోగ్యాన్ని ప్రభావితం చేయని సురక్షితమైన మొత్తం అంటూ ఏదీ లేదు. అంటే కొంచెం తాగినా ఆరోగ్యం పక్కాగా చెడిపోతుందని అర్థం.
 

38

విషపూరితం

ఆస్బెస్టాస్, రేడియేషన్, పొగాకుతో పాటుగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ద్వారా ఆల్కహాల్ గ్రూప్ 1 కార్సినోజెన్‌గా వర్గీకరించబడింది.
 

48

ఇథనాల్ శరీర అవయవాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది

ఆల్కహాల్ ప్రధాన భాగం ఇథనాల్. ఇది కడుపు, మెదడు, గుండె, పిత్తాశయం, కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. మందును మితిమీరి తాగితే మల విసర్జన సరిగ్గా ఉండదు. అలాగే అల్సర్లు, హేమోరాయిడ్లు వంటి సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా మందును తాగడం వల్ల కాలేయం వాపు వస్తుంది. ఇది ఆల్కహాలిక్ హెపటైటిస్ కు దారితీస్తుంది. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఇది సిరోసిస్ కు కారణమవుతుంది.
 

58
alcohol

మీకు తెలుసా? మందు మీ గుండె కండరాలను దెబ్బతీస్తుంది. అలాగే కార్డియోమయోపతికి కారణమవుతుంది. మందును తాగేవారికి న్యుమోనియా, క్షయవ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 8.1% టీబీ కేసులు మద్యపానంతో ముడిపడి ఉన్నాయి.

68

ఆల్కహాల్, ప్రాణాంతక వ్యాధుల మధ్య సంబంధం

ఇథనాల్ విచ్ఛిన్నమై అసిటాల్డిహైడ్ అనే విషపూరిత రసాయనంగా మారుతుంది. ఇది డీఎన్ఎను దెబ్బతీసే సంభావ్య క్యాన్సర్ కారకాన్ని ఏర్పరుస్తుంది. ఇథనాల్ రియాక్టివ్ ఆక్సిజన్ మూలకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆక్సీకరణ ద్వారా డీఎన్ఎ, ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది ఎన్నో శారీరక విధులకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు వంటి వివిధ రకాల ముఖ్యమైన పోషకాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ స్థాయిలను కూడా పెంచుతుంది.
 

78


ఆల్కహాల్ 7 రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది.

రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దప్రేగు, పురీషనాళం వంటి సాధారణ క్యాన్సర్లకు కారణమయ్యే  ప్రధాన కారకాల్లో ఆల్కహాల్ ఒకటి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ప్రకారం.. ఇథనాల్ విచ్ఛిన్నం మనుషులకు హాని కలిగించే క్యాన్సర్ పదార్థాలను ఏర్పరుస్తుంది. ఇథనాల్ (ఆల్కహాల్) శరీరంలో సమ్మేళనం విచ్ఛిన్నమైనప్పుడు జీవ విధానాల ద్వారా క్యాన్సర్ కు కారణమవుతుంది. అంటే ఆల్కహాల్ ను కలిగున్న ఏ పానీయం అయినా సరే దాని ధర, నాణ్యతతో సంబంధం లేకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది.
 

88

రెగ్యులర్ ఆల్కహాల్ శరీరానికి ఇలా చేస్తుంది

మందును రెగ్యులర్ గా తాగడం వల్ల మానసిక స్థితిలో  మార్పులు వస్తాయి. ఇది చికాకును కలిగిస్తుంది. నిద్ర పట్టకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. లిబిడోను కూడా ప్రభావితం చేస్తుంది. ఆకలి, బరువును కూడా ప్రభావితం చేస్తుంది. మందు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు కూడా అంతరాయం కలిగిస్తుంది. మీరు సాధారణ పనులపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది కలిగిస్తుంది. మీ సామాజిక ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories