బేకింగ్ సోడాతో సూపర్ హెల్త్ బెనిఫిట్స్.. డయాబెటిస్ నుంచి శరీర దుర్వాసన వరకు అన్ని మాయం!

Navya G   | Asianet News
Published : Jan 26, 2022, 03:49 PM IST

బేకింగ్ సోడా (Baking soda) అనేది సోడియం బైకార్బొనేట్ (Sodium bicarbonate) అనే ఒక రసాయన పదార్థం. బేకింగ్ సోడాను వంటలలో ఎక్కువగా వాడుతుంటారు. బేకింగ్ పౌడర్ లో ఉండే గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

PREV
18
బేకింగ్ సోడాతో సూపర్ హెల్త్ బెనిఫిట్స్.. డయాబెటిస్ నుంచి శరీర దుర్వాసన వరకు అన్ని మాయం!

నొప్పి, మంట సమస్యలను తగ్గిస్తుంది: శరీరంపై ఏదైనా పురుగు పాకినప్పుడు లేదా కుట్టినప్పుడు ఏర్పడే దురద (Itching), మంట, నొప్పి వంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కి కొద్దిగా నీరు కలిపి పేస్టులా చేసి ఆ ప్రాంతంలో రాస్తే నిదానంగా నొప్పి (Pain), మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
 

28

మౌత్ వాష్ గా సహాయపడుతుంది: నోటిలో పేరుకుపోయిన వైరస్ (Virus) ను నశింపచేయడానికి బేకింగ్ సోడా మంచి మౌత్ వాష్ (Mouthwash) ప్రొడక్ట్ గా సహాయపడుతుంది. ఇందుకోసం సగం గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అరచెంచా బేకింగ్ పౌడర్ వేసి కలుపుకుని ఆ నీటితో నోటిని పుక్కిలిస్తే నోటిలోని వైరస్ నశించి పళ్ళు తెల్లగా మెరుస్తాయి.

38

జీర్ణ సమస్యలు దూరమవుతాయి: తిన్న ఆహారం సరిగా జీర్ణం (Digestion) కాకపోవడంతో గుండెల్లో మంట, పొట్టలో వికారంగా అనిపిస్తుంది.  అలాంటప్పుడు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా (Baking soda) వేసి బాగా కలుపుకొని తాగితే గుండెల్లో మంట, పొట్టలో వికారం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.  

48

కిడ్నీ సమస్యలు తగ్గుతాయి: కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ పౌడర్ కు ఉంది. కనుక ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి కలుపుకొని రోజు తాగితే కిడ్నీలో రాళ్లు (Kidney stones) కరుగుతాయి. అంతే కాకుండా వాపు, పాదాల నొప్పులు (Foot pains) వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
 

58

శరీర దుర్వాసనను తగ్గిస్తుంది: అధిక చెమట కారణంగా కొందరికి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇందుకోసం నీళ్లు కలిపిన బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని కాటన్ బాల్స్ సహాయంతో చెమట (Sweat) ఎక్కువగా పట్టే ప్రదేశంలో అప్లై చేసుకుంటే శరీరం నుంచి వచ్చే దుర్వాసన (Stink) తగ్గుతుంది.
 

68

హ్యాండ్ వాష్ గా సహాయపడుతుంది: బేకింగ్ పౌడర్ మురికిని (Dirty) తొలగించే స్వభావాన్ని  కలిగి ఉంటుంది. కనుక బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని హ్యాండ్ వాష్ (Hand wash) గా ఉపయోగిస్తే చేతిలో మురికి తొలగిపోయి చక్కగా శుభ్రపడతాయి.
 

78

చర్మాన్ని మృదువుగా మారుస్తుంది: బేకింగ్ పౌడర్ తో ఆరోగ్యం (Health) మెరుగుపడటంతో పాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా మెరుగు పడుతుంది. ఇందుకోసం కొద్దిగా బేకింగ్ పౌడర్ ని స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

88

డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది: యాపిల్ సైడర్ వెనిగర్, బేకింగ్ సోడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ (Sugar levels) అదుపులో ఉంటాయి. దీంతో డయాబెటిస్ (Diabetes) నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే దీన్ని కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనుక డాక్టర్ల సలహా మేరకు ఉపయోగించడం మంచిది.

click me!

Recommended Stories