బియ్యం కడిగి లేదా ఉడకబెట్టడం ద్వారా వచ్చే ప్రభావంతమైన ద్రవం రైస్ వాటర్. దీనిని అందం కోసం,ఆరోగ్యం కోసం కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. ఇది మీ చర్మానికి మంచి టోనర్ లాగా పనిచేస్తుంది. అలాగే జుట్టుకి పట్టించడం వల్ల కుదుళ్ళు బలపడతాయి. రైస్ వాటర్ యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంటుంది.