ఈ మసాలా దినుసులు కూడా బరువును తగ్గిస్తయ్ తెలుసా?

Published : Aug 01, 2023, 11:51 AM IST

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం అంత సులువు కాదన్న సంగతి చాలా మందికి తెలుసు. అయితే మీరు స్లిమ్ గా, యాక్టీవ్ గా ఉండడానికి  కొన్ని మసాలా దినుసులు ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

PREV
18
 ఈ మసాలా దినుసులు కూడా బరువును తగ్గిస్తయ్ తెలుసా?
weight loss

చెడు ఆహారపు అలవాట్లు, పేలవమైన జీవనశైలి కారణంగా మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిలో ఓవర్ వెయిట్ ఒకటి. అవును ప్రస్తుతం చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. బరువు ఎంత తొందరగా పెరిగినా తగ్గడం మాత్రం అంత సులువు కాదంటున్న ముచ్చట ఈ సమస్య ఉన్నవారికి బాగా తెలుసు. ఈ బరువును తగ్గించుకోవడానికి రకరకాల వ్యాయామాలు, యోగా, డైట్ వంటి ఎన్నో పద్దతులను పాటిస్తుంటారు. అయితే మీరు బరువు తగ్గడానికి కొన్ని మసాలా దినుసులు కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే?

28
Image: Getty Images

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ మసాలా దినుసుల్లో విటమిన్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్య తగ్గడమే కాకుండా కూడా బరువు తగ్గుతారు. పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే గంట ముందు ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్కను మరిగించి ఆ నీరు సగం కాగానే దించేసి తాగాలి. ఇది శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే సీజనల్ వ్యాధులకు శరీరం దూరంగా ఉంటుంది. దీన్ని మీరు రెగ్యులర్ గా తాగడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. 

38

త్రిఫల

త్రిఫలాన్ని తీసుకోవడం వల్ల శరీరం అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉంటుంది. దీన్ని పౌడర్, జ్యూస్, కషాయంగా కూడా తీసుకోవచ్చు. ఈ ఔషధం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఒత్తిడి వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. ఇది జీవక్రియను పెంచి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రకారం.. త్రిఫల ఒక పోషకమైన ఆహారం. దీని సహాయంతో కడుపు, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులను విషరహితంగా ఉంచొచ్చు.

48
Image: Freepik

ఇందుకోసం త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగొచ్చు. అయితే మీకు కావాలంటే మీరు దీన్ని కషాయాన్ని కూడా తయారు చేయొచ్చు. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుంది. తేనె, దాల్చినచెక్కతో కలిపిన పొడిని కూడా తాగొచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీకి దూరంగా ఉంటారు.
 

58
Image: Getty

మెంతులు

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మెంతులు మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని తీసుకోవచ్చు. లేదా వీటిని పొడిగా కూడా తినొచ్చు.
 

68
Image: Getty

ఊబకాయానికి దూరంగా ఉండాలంటే 1 గ్లాసు నీటిలో అర టీస్పూన్ మెంతికూర, నల్ల మిరియాలు, పసుపు, చిన్న, చిక్కటి యాలకులు కలిపి కషాయం తయారుచేసుకోవాలి. నీరు సగం కాగానే తాగాలి. ఉదయాన్నే పరగడుపున కూడా తాగొచ్చు. ఇది మిమ్మల్ని ఊబకాయం సమస్యకు దూరంగా ఉంచుతుంది.
 

78
Image: Getty Images

చింతపండు

చింతపండులో విటమిన్లు, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. చింతపండు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే హైడ్రోసిట్రిక్ మూలకం శరీరాన్ని తేమ నుంచి కాపాడుతుంది. నిజానికి చింతపండు అతిగా తినడాన్ని కూకడా తగ్గిస్తుంది. 
 

88

కొద్దిగా చింతపండును తీసుకుని 2 గ్లాసుల నీటిలో నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టిన తర్వాత చింతపండును ఉదయం వడగట్టి దాని రసం తాగాలి. దీనికి తేనె, బ్లాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును కూడా తగ్గిస్తుంది. కావాలనుకుంటే చింతపండును చింతపండు పచ్చడిగా చేసుకుని కూడా తినొచ్చు. 
 

Read more Photos on
click me!

Recommended Stories