బిర్యానీ ఆకులను వంటలో వేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 14, 2024, 11:50 AM IST

బిర్యానీ ఆకులను చికెన్, మటన్, బిర్యానీ వంటి ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తాం. కానీ ఈ ఆకులను వేసిన ఫుడ్స్ ను తింటే ఏమౌతుందో తెలుసా? 

bay leaf

ఇతర దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో మాత్రం మసాలా దినుసులను బాగా ఉపయోగిస్తారు. నాన్ వెజ్ నుంచి వెజ్ వరకు చాలా రకాల వంటల్లో రకరకాల మసాలా దినుసులను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వాటిలో బిర్యానీ ఆకులు ఒకటి. 

బిర్యానీ ఆకుల వాసన కమ్మగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకు వేసిన ఏ వంటైనా రుచి అదిరిపోతుంది. రుచి, మంచి సువాసన కోసం బిర్యానీ ఆకులను వంటల్లో బాగా ఉపయోగిస్తారు. కానీ ఈ బిర్యానీ ఆకులు జస్ట్ రుచి, సువాసనకు మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అసలు బిర్యానీ ఆకులు వేసిన వంటలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


బిర్యానీ ఆకులను ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు

బిర్యానీ ఆకుల్లో లినలూల్ అనే స్పెషల్ మూలకముంటుంది. ఇది మన శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది యాంగ్జైటీని, ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇది శరీరంలో బాగా పెరిగిన కార్టిసాల్ లెవెల్స్ ను నియంత్రించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఈ బిర్యానీ ఆకుల్లో ఉండే ఈ స్పెషల్ మూలకం మన మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతుంది. మైండ్ ను రిలాక్స్ చేస్తుంది. 
 

బిర్యానీ ఆకులు జీర్ణ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ముఖ్యంగా అపానవాయువు (పిత్తులు) సమస్య ఉన్నవారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. బిర్యానీ ఆకుల వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎడిసిటీ వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. బిర్యానీ ఆకులు కడుపులో గ్యాస్ ఏర్పడకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బిర్యానీ ఆకులు కడుపులో నొప్పి, బరువును తగ్గిస్తుంది. దీనిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉదర కండరాలను రిలాక్స్ చేస్తాయి.

bay leaf

బార్థెనోలైడ్ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియెంట్ కూడా బిర్యానీ ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర మంటను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ల వాపు వంటి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడానికి కూడా బిర్యానీ ఆకు బాగా సహాయపడుతుంది. 

click me!