ఉదయాన్నే మందార టీని తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా?

First Published | Dec 8, 2023, 7:15 AM IST

ఉదయాన్నే కాఫీనో, టీనో తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇవి మన నిద్రమత్తును వదిలించి కాస్త ఎనర్జిక్ గా మార్చినా ఆరోగ్యానికి అంతగా మంచివి కావు. అయితే వీటికి బదులుగా మందార టీని తాగితే ఒంట్లో కొలెస్ట్రాల్ నుంచి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి తెలుసా? 
 

hibiscus tea

మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. పేరుకుతగ్గట్టు మంచి కొలెస్ట్రాల్ మంచే చేస్తుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ గుండెపోటు నుంచి ఎన్నో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది వ్యాధే కాదు. కానీ ఎన్నో రోగాలకు మాత్రం కారణమవుతుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.ఆరోగ్యకరమైన ఆహారపు  అలవాట్లను ఫాలో అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. అయితే ఉదయాన్నే మందార టీని తాగితే కొలెస్ట్రాల్ ఇట్టే కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

hibiscus tea

మందార పువ్వులు ఎర్రగా, ఎంతో అందంగా ఉంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఈ పువ్వులో ఎన్నో ఔషదగుణాలు దాగుంటాయి. ఈ పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి టీని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాదు మందార టీని తాగడం వల్ల అధిక రక్తపోటును కూడా తగ్గిపోతుంది. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

Latest Videos


hibiscus tea

మందార టీ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది తెలుసా? మీరు ఉదయం వ్యాయామం చేసిన తర్వాత కప్పు మందార టీని తాగితే శరీరంలోని కొవ్వు కరుగుతుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

hibiscus tea

యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మందార టీ మన చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు తెలుసా? మందార పువ్వులను ఎన్నో ఏండ్ల కాలం నుంచి జుట్టు పెరిగేందుకు ఉపయోగిస్తూ వస్తున్నారు. మందార పువ్వులు జుట్టును బలంగా చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే మందార టీని తాగడం వల్ల మీ జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

hibiscus tea

మందార టీని ఎలా తయారుచేయాలంటే? 

మందార పువ్వుల రేకులను తీసుకుని వాటిని నీటిలో వేసి బాగా కడగండి. తర్వాత ఒక గిన్నెలో 3-4 గ్లాసుల నీటిని పోసి బాగా మరిగించాలి. దీనిలో  చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్కను వేయాలి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో మందార పువ్వుల రేకులను వేయాలి. రెండు నిమిషాల పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత నీళ్లు ముదురు ఎర్రరంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ను ఆఫ్ చేయాలి. తర్వాత నీటిని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే వేడివేడి మందార టీని తాగొచ్చు.

click me!