రాత్రిపూట తినట్లేదా? మీ పని అంతే ఇక..

First Published | Dec 6, 2023, 4:46 PM IST

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలా ఖచ్చితంగా తినాలి. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట మరువకుండా తినాలన్నమాట. ఎందుకంటే మనం శక్తివంతంగా ఉండటానికి, రోజువారి పనులను చేసుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం చాలా అవసరం. అయితే కొంతమంది రాత్రిపూట భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ ఇలా చేస్తే మీరెన్నో రోగాల బారిన పడతారు తెలుసా? 
 

dinner

మీరు జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. శరీర పోషణకు, మన ఎదుగుదలకు ఫుడ్ చాలా చాలా అవసరం. తింటేనే మన ఒంటికి శక్తి అంది మన పనులను చేసుకోగలుగుతాం. యాక్టీవ్ గా ఉండగలుగుతాం. అందుకే ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. అయితే చాలా మంది రాత్రిపూట మాత్రం తినకుండానే నిద్రపోతుంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొంతమంది పనిచేసి రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి రాగానే అలసిపోయి పడుకుంటారు. అయితే ఇంకొంతమంది మాత్రం రాత్రిపూట తినకపోతే బరువు తగ్గుతారని తినకుండా ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు రోగాల బారిన పడేసుకున్నవారవుతారు తెలుసా? ఆరోగ్య నిపుణుల ప్రకారం.. డిన్నర్ ను మానేస్తే ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

పోషకాహార లోపం 

బరువు తగ్గుతామని రాత్రిపూట తినకపోతే మీరు పెద్ద తప్పు చేసినట్టే. ఎందుకంటే రాత్రిపూట తినకపోవడం వల్ల మీ శరీరంలో పోషకాహార లోపాలు ఏర్పడతాయి. అంటే మీరు పోషకాహార లోపానికి గురవుతారన్న మాట. ఇది మీ శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీరు బలహీనంగా మారుతారు. అలాగే రక్తహీనత సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. 
 

Latest Videos


ఎనర్జీ లేకపోవడం

సోమరితనం వల్ల రాత్రిపూట తినకపోతే మీరు పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్టే అవుతుంది. అవును ఇది చెడు అలవాటు. మీరు దీన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు. రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు శారీరక శ్రమ చేయకపోయినా మన మెదడు పనిచేస్తుంది. దీనివల్ల మరుసటి రోజు మీరు బలహీనంగా ఉంటారు. బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. 
 

fatigue

నిద్రకు భంగం

మీరు గమనించారో లేదో  రాత్రిపూట తినకపోవడం వల్ల సరిగ్గా నిద్రరాదు. అలాగే రోజు మీరు బద్ధకం, అలసటగా భావిస్తారు. అందుకే ఎట్టిపరిస్థితిలో డిన్నర్ ను స్కిప్ చేయకండి. 
 

జీర్ణక్రియ ప్రభావితం

మీరు రాత్రి భోజనం చేయడం మానేస్తే.. అది మీ జీర్ణవ్యవస్థను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియ విఫలమైతే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.  అందుకే మర్చిపోకుండా డిన్నర్ చేయండి. దీనివల్ల మీ శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. సరైన ఆహారం, నిద్ర మన రోజును మరింత ఆనందంగా ఉంచుతాయి. అలాగే మన జీవనశైలిని మెరుగుపరుస్తాయి. 
 

click me!