మనం ఉపయోగించే వంట పదార్థాల్లో, మసాలా దినుసుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ మనం వాటిని తెలుసుకోకుండా వాడేస్తున్నాం.. అలాంటి వాటిలో వెల్లుల్లి ఒకటి. వంటల రుచిని పెంచడానికి, కమ్మని వాసన రావడానికని మాత్రమే వెల్లుల్లిని ఉపయోగిస్తుంటారు. కొంతమంది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడానికి వెల్లుల్లిని తీసుకుంటారు. నిజానికి వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది ఎన్నో వ్యాధులను తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి లు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి.