పెరుగును తినని వారు ఉండరు. పాల అలెర్జీ ఉన్నవారు తప్ప మిగతా అందరూ పెరుగును ఇష్టంగా తింటారు. పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగులో కాల్షియం, విటమిన్ బి -2, పొటాషియం , మెగ్నీషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. పెరుగు ఒక గొప్ప ప్రోబయోటిక్. రోజూ పెరుగును మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, కడుపు అసౌకర్యం తగ్గుతుంది. పెరుగు కడుపు, ప్రేగుల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ప్రోబయోటిక్ కావడంతో పెరుగులో మంచి బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉంటుంది.