పెళ్లైన పురుషులూ జర జాగ్రత్త.. ఈ పనులు సంతానం లేకుండా చేస్తాయి మరి

Published : Jul 03, 2023, 04:26 PM IST

పురుషుల కొన్ని ఆహారపు అలవాట్లు ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తాయి. అందులో సంతానలేమి ఒకటి. అవును భారతదేశంలో సంతానలేమి సమస్యలు పెరిగిపోతున్నాయని సర్వేలు వెళ్లడిస్తున్నాయి.   

PREV
16
 పెళ్లైన పురుషులూ జర జాగ్రత్త.. ఈ పనులు సంతానం లేకుండా చేస్తాయి మరి

కొన్నేండ్ల నుంచి పురుషుల సంతానోత్పత్తి తగ్గుతూ వస్తోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జెనెటిక్స్, ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారడం వంటివి దీనికి ఎక్కువగా కారణమవుతున్నాయి. దీంతో పురుషులు తండ్రులు కాలేకపోవడమే కాదు వారి లైంగిక జీవితం కూడా ఎంతో ప్రభావితం అవుతోందని నిపుణులు చెబుతతున్నారు. ఇది స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను కూడా తగ్గిస్తుంది. అందుకే పెళ్లైన పురుషులు తక్షణమే మానేయాల్సిన అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
Infertility

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం, ఇతర ఆహారాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటే మీ సంతానోత్పత్తిపై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల మీకు పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. అందుకే ప్రాసెస్ చేసిని మాంసానికి బదులుగా తాజా మాంసాన్నే తినండి.
 

36
men infertility

శీతల పానీయాలు

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఎండలు అంటూ ఏదో ఒక సందర్భాన్ని కారణంగా చూసుకుని శీతల పానీయాలను తాగే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ పానీయాలు ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఎందుకంటే వీటిలో చక్కెర, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి మీ స్పెర్మ్ నాణ్యతను బాగా ప్రభావితం చేస్తాయి. 

46

టీ, కాఫీ

టీ, కాఫీలు మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. అందుకే ఉదయం లేచిన వెంటనే కాకుండా పొద్దంతా నాలుగైదు సార్లు తాగుతుంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఈ టీ, కాఫీలు పురుషులకు చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీటిని తాగితే పురుషుల్లో పునరుత్పత్తి కణాల ఆరోగ్యం దెబ్బతింటుంది. 
 

56

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ నోరూరిస్తాయి. అందుకే చాలా మంది వీటిని రోజూ లాగిస్తుంటారు. కానీ ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. వీటిని పురుషులు తింటే ఎన్నో రోగాలతో పాటుగా మగ వంధ్యత్వం సమస్య కూడా వస్తుంది. 
 

66

మందు, సిగరేట్లు

మందు, సిగరేట్లు ఆరోగ్యానికి హానికరం అన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ ఈ అలవాట్లు ఉన్నవారు చాలా మందే ఉన్నారు. ఇవి పురుషుల లైంగిక జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా తండ్రి కాకుండా చేస్తాయి. ఎందుకంటే ఇవి పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్నిచూపుతాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories