మనలో చాలా మంది లేచిన వెంటనే వేడి టీనో లేకపోతే కాఫీనో తాగుతుంటారు. టీ, కాఫీలు తాగనిదే ఏ పనీ తోచదు మరి. ఇవి మూడ్ ను రిఫ్రెష్ చేస్తాయి. నిద్ర మత్తును వదిలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? చాలా మందికి టీ, కాఫీలు తాగిన తర్వాతే కడుపు క్లియర్ అవుతుంది. ఏదేమైనా.. పరిగడుపున ఈ టీ, కాఫీలను తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిని పరగడుపున తాగడం వల్ల రోజంతా గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తారు. దీనివల్ల మీకు ఇంకేం తినాలనిపించదు. దీంతో మీకు బలహీనంగా అనిపిస్తుంది. మరి టీ, కాఫీలకు బదులుగా ఎలాంటి ఆకులను తింటే మంచిదో తెలుసుకుందాం పదండి.
వేప ఆకులు
వేప ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆకులను పరిగడుపున తింటే రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. రక్తం శుభ్రపడుతుంది. దీని వల్ల మీ మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
curry leaves
కరివేపాకు
కరివేపాకుకు కూరల్లో ఎక్కువగా వేస్తుంటారు. ఎందుకంటే ఇది వంటలను టేస్టీగా చేస్తుంది. కానీ వీటిని తినేవారు చాలా తక్కువే. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులు అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
తులసి ఆకులు
తులసి ఆకులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వీటిని ఎన్నో ఏండ్లుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులను ఉదయం పరగడుపున నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులకు దూరంగా ఉంటారు. ఈ ఆకులు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.
సెలెరీ ఆకులు
సెలెరీ ఆకులు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఎన్నో రకాల ఎంజైములు ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు రావు.
ఎవర్ గ్రీన్ ఆకులు
ఎవర్ గ్రీన్ ఆకులు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఈ ఆకులు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని దూరం చేయడానికి కూడా ఈ ఆకులు సహాయపడతాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలండి.