జొన్న రొట్టెలను భారతదేశంలో ఎక్కువకగా తింటారు. నిజానికి జొన్నల్లో బియ్యంలో కంటె ఎక్కువ పోషకాలుంటాయి. అందుకే జొన్న రొట్టెలను తింటే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. జొన్నల్లో విటమిన్ బి3, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. జొన్న పిండిని రొట్టె చేయడానికే కాదు లడ్డూలు, అంబలి, అప్పడాలు తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. మీకు తెలుసా బియ్యం కంటే జొన్నలే ఎక్కువ ధర పలుకుతాయి. జొన్నలను తీసుకోవడం వల్ల మన శరీరంలో కేలరీలు పెరిగే అవకాశమే ఉండదు. ఇది మన శరీరంలో శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. అసలు జొన్న రొట్టెలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..