వానాకాలంలో డయాబెటీస్ పేషెంట్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..?

First Published | Jul 29, 2023, 2:07 PM IST

డయాబెటీస్ వల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడాలి.
 

diabetes

డయాబెటిస్ పేషెంట్ల జీవన శైలి మెరుగ్గా ఉంటే ఈ వ్యాధి వల్ల ఇతర రోగాలొచ్చే ముప్పు తప్పుతుంది. అలాగే డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ముందే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోలేం. మీకు తెలుసా? డయాబెటీస్ ఎన్నో రోగాలకు కారణమవుతుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సీజన్ లో మధుమేహుల్లో ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. తక్కువ రోగనిరోధక శక్తి డయాబెటిస్ ఉన్నవారికి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే మధుమేహులు వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ పేషెంట్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆహారం

మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే ఆహారాలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో వీలైనంత వరకు బయటి ఫుడ్ కు దూరంగా ఉండండి. విటమిన్  సి ఎక్కువగా ఉండే ఆహారాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను కూడా తినండి. కూరగాయలను ఎక్కువగా తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 
 


వ్యక్తిగత శుభ్రత

వర్షాకాలంలో తడిగా ఉండటం వల్ల క్రిముల వల్ల ఎన్నో ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అందుకే ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడాలంటే వీలైనంత వరకు తడిగా ఉండకుండా జాగ్రత్త పడండి. సాధ్యమైనంత వరకు వ్యాధులకు దూరంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి.
 

వ్యాయామం

మీకు ఏదైనా ఆరోగ్య సమస్య లేదా ఆరోగ్యం బాగాలేకపోయినా.. రోజూ వ్యాయామం చేయడం మంచిది.. డయాబెటిస్ ఉన్నవారు కూడా వర్షాకాలంలో వారి వయస్సు, ఆరోగ్యాన్ని బట్టి వ్యాయామం చేయాలి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
 

diabetic control

వాటర్

వర్షాకాలంలో సాధారణంగా నీటిని తక్కువగా తాగుతుంటారు. కానీ నీళ్లను కాలాలతో సంబంధం లేకుండా తాగాలి. ఎందుకంటే నీళ్లను తక్కువగా తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇకపోతే మధుమేహులు వర్షాకాలంలో నీళ్లను తక్కువగా తాగడం మంచిది కాదు. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో తగినంత నీటిని తాగాలి.
 

diabetic control

షుగర్ టెస్టింగ్

డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా షుగర్ చెక్ చేయించుకోవడం తప్పనిసరి. ఎందుకంటే షుగర్ పెరిగితే దాన్ని త్వరగా గుర్తించలేకపోవచ్చు. అందుకే దీన్ని గుర్తించి నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ షుగర్ టెస్టింగ్ ను ఏ సీజన్ లో అయినా చేయాలి. కానీ వర్షాకాలంలో మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ. కాబట్టి ఈ సీజన్ లో తప్పకుండా చెక్ చేసుకోవాలి. 

Latest Videos

click me!