వీటిని తీసుకుంటే శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని పెంచి అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతాయి. మరి పచ్చిమామిడికాయలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) ఏమిటో తెలుసుకుందాం..
29
మామిడిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ (King of Fruits) గా పిలుస్తారు. వేసవిలో లభించే పండ్లలన్నింటిలో కల్లా మామిడి చాలా ప్రత్యేకమైనది. ఇందులో అనేక పోషకాలు (Nutrients) ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తాయి. ఈ మామిడికాయలతో చట్ని, ఊరగాయ, మామిడి పప్పు వంటి ఇతర వంటకాలను వండుకోవచ్చు.
39
ఇలా పచ్చిమామిడికాయలతో చేసుకునే వంటలు పుల్లపుల్లగా (Sour) చాలా రుచిగా ఉంటాయి. అలాగే పచ్చిమామిడికాయపై ఉప్పు, కారం చల్లుకుని తింటే మరింత రుచిగా ఉంటాయి. ఇలా వేసవిలో లభించే పచ్చిమామిడి కాయలను ఏదో ఒక రూపంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి (Instant power) లభిస్తుంది.
49
బరువు తగ్గుతారు: పచ్చిమామిడికాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) ను తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే బరువు తగ్గుతారు (Lose weight). కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు డైట్ లో పచ్చిమామిడికాయలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
59
శరీర వేడిని తగ్గిస్తుంది: వేసవి కాలంలో అధిక ఎండ కారణంగా శరీరం సోడియం (Sodium), ఐరన్ (Iron) వంటి ఇతర ఖనిజాలను కోల్పోతుంది. కనుక ఈ కాలంలో లభించే పచ్చిమామిడికాయలను లేదా మామిడి జ్యూస్ ను తీసుకుంటే శరీరం కోల్పోయిన ఖనిజాలు తిరిగి భర్తీ అవుతాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించి వేడిని తగ్గిస్తుంది.
69
గుండె సమస్యలు తగ్గుతాయి: పచ్చిమామిడికాయలలో నియాసిన్ (Niacin) సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి తోపాటు రక్తనాళాల్లో ఏర్పడే ఆటంకాలను కూడ తొలగిస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె సమస్యలు (Heart problems) తగ్గుతాయి.
79
దంత సమస్యలు తగ్గుతాయి: పచ్చిమామిడికాయలు నమిలి తింటే దంత సమస్యలు (Dental problems) తగ్గుతాయి. ఇది దంతాలను, చిగుళ్లను బలపరుస్తాయి. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి కారణంగా చిగుళ్ల నుండి రక్తం కారే సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన (Bad breath) సమస్యలు కూడా తగ్గిపోతాయి.
89
లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది: పచ్చిమామిడికాయలో ఉండే పోషకాలు లివర్ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతాయి. అలాగే లివర్ ఇన్ఫెక్షన్ (Infections) లు తగ్గి లివర్ ఆరోగ్యం (Liver health) మెరుగుపడుతుంది. కనుక పచ్చిమామిడికాయలను తీసుకుంటే లివర్ ఆరోగ్యానికి మంచిది
99
అలాగే వీటితో పాటు మలబద్ధకం (Constipation), అసిడిటీ, గుండెల్లో మంట, డయేరియా (Diarrhea), సిక్‌నెస్ వంటి అనేక సమస్యలు కూడా తగ్గుతాయి. కనుక సీజన్ లో లభించే పచ్చిమామిడికాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు.