ద్రాక్షలను తినలేదో.. ఈ లాభాలు మిస్ అయిట్టే మరి..!

Published : Mar 31, 2023, 11:38 AM IST

ద్రాక్షలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పండ్లను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కలిగే మోకాలి నొప్పి కూడా తగ్గిపోతుంది. 

PREV
16
 ద్రాక్షలను తినలేదో.. ఈ లాభాలు మిస్ అయిట్టే మరి..!

ద్రాక్షలను తినని వారు అసలే ఉండరేమో.. ఈ పండ్లు తియ్యగా, రుచిగా ఉంటాయి. ఈ పండ్లు ఆకుపచ్చ, ఎరుపు, నీలం, ఊదా, నల్ల రంగులో ఉంటాయి. నిజానికి ఈ పండ్లలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఈ పండ్లలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు నిండి ఉంటాయి. ద్రాక్షపండ్లు విటమిన్లు సి, విటమిన్ కె కు అద్భుతమైన మూలం. అలాగే ఈ పండ్లలో పొటాషియం, ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఎన్నో రోగాలను దూరం చేయడానికి సహాయపడతాయి. ద్రాక్షలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

క్యాన్సర్ నివారణ

పాలీఫెనాల్స్ అనే ఒక రకమైన యాంటీఆక్సిడెంట్ ద్రాక్షలో ఉంటాయి. అలాగే ఈ పండులో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఎర్ర ద్రాక్ష తొక్కలో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది శోషరస, కాలేయం, కడుపు, రొమ్ము, పెద్దప్రేగు, చర్మం, లుకేమియా వంటి వివిధ క్యాన్సర్లలో కణితుల అభివృద్ధిని నిరోధిస్తుంది.  ద్రాక్షలో ఉండే మరొక శక్తివంతమైన సహజ ఫ్లేవనాయిడ్ క్వెర్సెటిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.
 

36

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది

ద్రాక్షలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల సమ్మేళనాలు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాల్లో తేలింది. పాలీఫెనాల్స్ మంటను తగ్గించడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

46

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎర్ర ద్రాక్షను తినడం వల్ల వయస్సు-సంబంధిత దృష్టి నష్టం, మాక్యులర్ క్షీణతను నివారించొచ్చు. రోజుకు మూడు సేర్విన్గ్స్ ద్రాక్ష తినడం వల్ల మాక్యులర్ క్షీణత ప్రమాదం 36% తగ్గుతుంది.  ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షలో కంటిచూపును మెరుగుపరిచే అనేక పోషకాలు ఉంటాయి. 

56

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ద్రాక్షలో వివిధ రకాల పోషకాలు, రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ వంటి విటమిన్లు, ఇనుము, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మీ రోజువారీ ఆహారంలో గుప్పెడు ద్రాక్షను చేర్చుకోవడం వల్ల జలుబు, ఇతర అనారోగ్యాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

66

ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది

ద్రాక్షలో రాగి, ఇనుము, మాంగనీస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో ద్రాక్షను చేర్చుకోవడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ తో సంబంధం ఉన్న మోకాలి నొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 
 

click me!

Recommended Stories