పసుపు
పసుపులో దివ్య ఔషదాలు దాగున్నాయి. దీనిలో శోథ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు నొప్పులను తగ్గించడానికి ఉపయోగించే సహజ నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది. పసుపులో అనేక యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది గాయాలు, ఇతర చర్మ వ్యాధులను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు పసుపు ఫ్లూ వల్ల కలిగే సమస్యలను, నోటి పూతను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.