నిద్రలోనే సగం రోగం తగ్గుతుంది. మరెన్నో రోగాల ముప్పు తప్పుతుంది. కానీ ప్రస్తుతం ఎంతో మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు, హై బీపీ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే నిద్రలేమి సమస్యలను పోగొట్టడానికి, గాఢంగా నిద్రపట్టడానికి మార్కెట్ లోకి కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అందులో ఒకటి స్లీప్ మాస్క్. ఈ స్లీప్ మాస్క్ కళ్లపై కాంతిని పడకుండా చేసి కళ్లకు రెస్ట్ ఇస్తుంది. అలాగే ప్రశాంతంగా నిద్రపట్టేలా చేస్తుంది. ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అందుకే ఈ మద్యకాలంలో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. వీటిని చాలా మంది వాడుతున్నారు. ఏదేమైనా స్లీప్ మాస్క్ వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.