రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే..!

Published : Aug 20, 2023, 07:15 AM IST

వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని పచ్చిగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.   

PREV
16
 రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తింటే..!

వెల్లుల్లిని మనం ప్రతిరోజూ కూరల్లో వేస్తాం. వెల్లుల్లి వంటలను టేస్టీగా చేస్తుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మాంగనీస్, సెలీనియం, ఫైబర్స్, ఇనుము, కాల్షియం, భాస్వరం, రాగి, పొటాషియంతో సహా అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 
 

26

వెల్లుల్లి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. వెల్లుల్లి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అలాగే కడుపు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఎల్డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే క్రియాశీల సమ్మేళనం.
 

36

వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంది. ఇందులో అల్లిసిన్ అనే సల్ఫ్యూరిక్ సమ్మేళనం కూడా ఉంటుంది. అల్లిసిన్ తెల్ల రక్త కణాల పనితీరును పెంచుతుంది. అంటువ్యాధులు, హానికరమైన వ్యాధికారకాల నుంచి శరీరాన్ని రక్షించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. 

46

ఉదయాన్నే వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వెల్లుల్లిలో ప్రీబయోటిక్ గుణాలుంటాయి. ఇది ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే గట్ మైక్రోబయోమ్ కు సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ మంచి పోషకాలను గ్రహించడానికి, జీర్ణశయాంతర సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
 

56

వెల్లుల్లి ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రీ డయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది.

66
Garlic

వెల్లుల్లి తినడం వల్ల ధమనులు, రక్త నాళాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఎర్ర రక్త కణాలు వెల్లుల్లిలోని సల్ఫర్ ను హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుగా మారుస్తాయి. ఇది మన రక్త నాళాలను విస్తరిస్తుంది. దీంతో మీ రక్తపోటు స్థాయిలు నార్మల్ గా ఉంటాయి.

click me!

Recommended Stories