కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్‌తో చర్మ సౌందర్యం.. ఈ చిట్కాలతో మెరిసిపోయే అందం!

Navya G   | Asianet News
Published : Dec 23, 2021, 05:03 PM IST

చర్మ సౌందర్యం (Skin beauty) కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారా! అయినా తగిన ఫలితం లభించలేదా? దీనికోసం బయట మార్కెట్లో లభించే ఆర్టిఫిషియల్ క్రీమ్స్ ల వాడకం తగ్గించి ఇంటిలోనే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుంటే చర్మసౌందర్యానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  

PREV
19
కుంకుమపువ్వు ఫేస్ ప్యాక్‌తో చర్మ సౌందర్యం.. ఈ చిట్కాలతో మెరిసిపోయే అందం!

అయితే చర్మ సౌందర్యం కోసం కుంకుమపువ్వు మంచి ఫలితాలను అందిస్తుంది. కుంకుమపువ్వుతో (Saffron) ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని చర్మానికి అప్లై చేసుకుంటే చర్మ సమస్యలు తగ్గి చర్మం మంచి నిగారింపును పొందుతుంది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా కుంకుమపువ్వుతో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్ ల గురించి తెలుసుకుందాం..
 

29

కుంకుమపువ్వు రుచికి చేదుగా తియ్యగా ఉండి పదార్థాలకు అదనపు రుచిని (Taste), మంచి రంగును ఇస్తాయి. కుంకుమపువ్వు కాశ్మీర్ (Kashmir) లో పండుతోంది. పువ్వు మధ్యభాగం ఉండే రేణువులను తీసి కుంకుమపువ్వు తయారు చేస్తారు. కుంకుమపువ్వు ధర చాలా ఎక్కువ.
 

39

కుంకుమపువ్వులో ఉండే ఔషధ గుణాలు (Medicinal properties) శరీర ఆరోగ్యానికి, చర్మసౌందర్యానికి మంచి బెనిఫిట్స్ (Benefits) ను అందిస్తాయి. గర్భిణీలు కుంకుమపువ్వు రేకులను పాలతో కలిపి తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు మంచి నిగారింపు అందుతుంది అని భావిస్తారు. చర్మ సౌందర్యం కోసం కుంకుమపువ్వును ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం..
 

49

మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది: ఒక కప్పులో రెండు కుంకుమపువ్వు రేకుల పొడి (Saffron petal powder), ఒక స్పూన్ తేనె (Honey) వేసి కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పదినిమిషాల తరువాత ఇందులో రెండు స్పూన్ ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
 

59

ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే ముఖంపై మొటిమలు (Pimples) వాటి తాలూకు మచ్చలు (Spots) తగ్గిపోతాయి. అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం అవుతుంది.
 

69

మృతకణాలు తొలగిపోతాయి: ఒక కప్పులో పాల మీగడ (Milk cream), రెండు కుంకుమ పువ్వు రేకుల పొడి (Saffron petal powder), చిటికెడు పసుపు (Turmeric) వేసి బాగా కలుపుకోవాలి.
 

79

ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి. ఇలా చేస్తే చర్మంలో పేరుకుపోయిన మృత కణాలు (Dead cells)'తొలగిపోతాయి. మృదువైన చర్మ (Smooth skin) సౌందర్యం మీ సొంతం అవుతుంది 
 

89

చర్మం నిగారింపును పెంచుతుంది: ముందుగా మూడు కుంకుమ (Saffron) రేకులను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీళ్ళు రంగు మారుతాయి. అప్పుడు ఇందులో ఒక స్పూన్ పంచదార (Sugar), ఒక స్పూన్ పాలు (Milk), రెండు చుక్కల ఆలీవ్ నూనె (Olive oil) వేసి బాగా కలుపుకోవాలి.
 

99

ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని శరీరానికి (Body) అప్లై చేసుకోవాలి. అరగంట తరువాత సబ్బు వాడకుండా చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చర్మ సమస్యలు (Skin problems) తగ్గి చర్మం నిగారింపు పెరుగుతుంది.

click me!

Recommended Stories