ఈ ఫుడ్స్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతయ్.. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం?

First Published | Sep 11, 2023, 1:58 PM IST

క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలితీసుకుంటోంది. ఈ వ్యాధికి మొదట్లోనే చికిత్స తీసుకోకపోతే  ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే మనం తినే కొన్ని ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

cancer

ప్రస్తుత కాలంలో మన జీవతన విధానాలు పూర్తిగా మారిపోయాయి.  పని ఒత్తిడి పెరగడంతో చాలా మంది పనిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. కానీ ఈ పనిభారం వల్ల చాలా మంది సరిగ్గా తినరు. కంటినిండా నిద్రపోరు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చేలా చేస్తుంది. 

ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ తో చాలా మంది చనిపోతున్నారు. ఈ వ్యాధి రాకూడదంటే మన జీవినశైలి మారాలి.అయితే కొన్ని ఆహారాలు క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Latest Videos


processed meat

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం రుచిగా ఉండొచ్చు. కానీ ఇది మీ  ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తింటే మీకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి ఆహారాల్లో సాసేజ్లు, బేకన్, హాట్ డాగ్స్ ఉన్నాయి. 
 

ఆల్కహాల్

ఆల్కహాల్ ను రోజూ తాగేవారున్నారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆరోగ్య నిపుణులు, డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. మందును రోజూ, ఎక్కువగా తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ మధ్య కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంత ఆల్కహాల్ మీకు సురక్షితం అనే కొలత లేదని నివేదించింది కూడా. అందుకే ఒక చుక్క ఆల్కహాల్ కూడా క్యాన్సర్ కు కారణమవుతుంది. 
 

పొగాకు 

పొగాకులో ఎన్నో హానికరమైన పదార్థాలు ఉంటాయి. స్మోకింగ్ చేసినా.. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. 
 

అధిక బరువు

ఉండాల్సిన బరువు కంటే మరీ ఎక్కువగా ఉన్నా ఊబకాయం బారిన పడ్డా క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. 
 

click me!