గుమ్మడికాయలో విటమిన్ బి1, బి2, బి6, సి, డి, బీటా కెరోటిన్స్ (Beta carotenes) పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఐరన్, క్యాల్షియం, కాపర్, పొటాషియం, జింక్ వంటి పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. కనుక కూల్ డ్రింక్స్ వంటి రసాయన శీతల పానీయాలకు బదులుగా గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు బోలెడు.