ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Published : Apr 08, 2022, 02:44 PM IST

కొబ్బరి నీళ్లు (Coconut water) శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన మంచి హెల్తీ డ్రింక్. కొబ్బరి నీళ్లను తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు (Health benefits) కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
17
ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

కొబ్బరి నీళ్లు మన దాహార్తిని (Thirsty) తీర్చడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కనుక అన్ని సీజన్లలో సమృద్ధిగా లభించే కొబ్బరి నీళ్లను తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరి నీళ్లను తాగితే మంచి ఫలితం వుంటుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం (Potassium) సమృద్ధిగా ఉంటుంది.
 

27

ఇది శరీరంలో పేరుకుపోయిన జీర్ణాశయ వ్యర్థాలను, మలినాలను బయటకు పంపించడానికి సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గుతారు (Lose weight). అలాగే కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ, కడుపులో మంట వంటి ఇతర ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఉదర ఆరోగ్యాన్ని (Abdominal health) మెరుగుపరుస్తుంది.
 

37

శరీరంలో మెటబాలిజాన్ని పెంచి తిన్న ఆహారం సులువుగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఖనిజాలు (Minerals), విటమిన్లు (Vitamins) పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్యం కారణంగా నీరసించిన శరీరానికి తక్షణ శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 

47

కాబట్టి అనారోగ్యం నుండి కోలుకునే వారికి కొబ్బరినీళ్లు మంచి ఎనర్జీ డ్రింక్ (Energy Drink) గా సహాయపడతాయి. కొబ్బరి నీళ్లకు కిడ్నీలో ఏర్పడ్డ రాళ్ళను కరిగించే సామర్థ్యం కూడా ఉంటుంది. కనుక ఈ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లను తీసుకుంటే మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లు కరిగిపోతాయి. అలాగే మూత్రపిండాల ఆరోగ్యం (Kidney health) కూడా మెరుగుపడుతుంది.
 

57

కొబ్బరి నీళ్లను వేసవికాలంలో ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ (Dehydration) బారినపడకుండా చేస్తుంది. అలాగే శరీరానికి తక్షణ శక్తిని అందించి రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కొబ్బరి నీళ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించి షుగర్ వ్యాధిని (Diabetes) నియంత్రణలో ఉంచుతుంది.
 

67

కనుక షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు.కొబ్బరి నీళ్లను తీసుకుంటే ఆరోగ్యంతో (Health) పాటు చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. కొబ్బరినీళ్లు చర్మానికి తగిన పోషణను (Nutrition) అందించి చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. అలాగే చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా  ఉంచుతుంది.

77

దీంతో చర్మంపైన ఏర్పడిన మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి చర్మ సౌందర్యం (Skin beauty) మరింత రెట్టింపవుతుంది. అంతేకాకుండా జుట్టు సౌందర్యం (Hair beauty) కూడా మెరుగుపడుతుంది. కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి జుట్టు ఒత్తుగా, బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. కనుక కొబ్బరి నీటిని తాగండి ఆరోగ్యంగా ఉండండి.

click me!

Recommended Stories