ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కిస్ మిస్ లల్లో పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇలాంటి వాటిని నీళ్లలో నానబెడితే పోషకాలు రెట్టింపు అవుతాయి. వీటి ప్రయోజనాలు పెరుగుతాయి. ఇందుకోసం రెండు గ్లాసుల నీటిని మరిగించి అందులో 150 గ్రాముల ఎండుద్రాక్షలను వేయాలి. వీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి కొద్దిగా వేడి చేసి పరిగడుపున తాగితే ఎంతో మంచి జరుగుతుంది. ఎండుద్రాక్షలతో మరిగించిన నీటిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను పోగొడుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు ఈ నీటిని రోజూ తాగాలని నిపుణులు చెబుతున్నారు.