ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. పెళ్లి అప్పుడే, లేదా ఫంక్షన్, వెకేషన్, పండుగల రోజే నెలసరి వస్తుందేమోనని చాలా మంది ఆడవారు భయపడిపోతుంటారు. నెలసరి ఉబ్బరం, విరేచనాలు, తిమ్మిరి, ఒంట్లో శక్తి తగ్గడం, అలసట వంటి ఎన్నో ఇతర సమస్యలను కలిగిస్తుంది. అందుకే చాలా మంది ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు పీరియడ్స్ లేట్ అయ్యేందుకు మందులను వాడుతుంటారు.