మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..!

Published : Jun 05, 2023, 03:05 PM IST

డయాబెటీస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవన శైలి, స్మోకింగ్, ఆల్కహాల్, ఊబకాయం వంటివి మీ గుండెను రిస్క్ లో పడేస్తాయి.   

PREV
19
మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే..!
heart health

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. కార్డియోవాస్క్యులర్ డిసీజ్ ప్రపంచంలో ఎక్కువ మరణాలకు ప్రధాన కారణం. అనారోగ్యకరమైన జీవనశైలి మన గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి, మద్యపానం, ధూమపానం, ఊబకాయం మొదలైనవి గుండెను ప్రభావితం చేసే కొన్ని అంశాలు. మరి మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

29

ప్యాకేజ్డ్ ఫుడ్స్

ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్ మన గుండె ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తాయి. శీతల పానీయాలు, ఫాస్ట్ ఫుడ్, స్వీట్లు మొదలైనవి ఎక్కువగా తినకండి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 
 

39
Image: Getty Images

పండ్లు, కూరగాయలు

మీ గుండె ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి. గుండె ఆరోగ్యం కోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు వంటి తృణధాన్యాలను ఎక్కువగా తినండి. ఫైబర్ తో పాటుగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. అలాగే విటమిన్లు,  ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. మీరు తినే ఆహారంలో ఉప్పును ఎక్కువగా వేయకండి. 
 

49

హైడ్రేట్

మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. రోజంతా  నీళ్లను పుష్కలంగా తాగాలి. ఇది మీ గుండెను  మీ మొత్తం శరీరాన్ని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

59

కొలెస్ట్రాల్

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతే గుండెపోటు నుంచి స్ట్రోక్ వరకు ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. అందుకే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే చిట్కాలను ఫాలో కావాలి. 
 

69
diabetes

డయాబెటీస్

డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ సమస్యలను దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి.
 

79
പുകവലി

స్మోకింగ్

స్మోకింగ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ధూమపానం వల్ల గుండె జబ్బుల రేటు పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ధూమపానం గుండెను మాత్రమే కాకుండా ఇతర అవయవాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. 

89
Image: Getty

మద్యం

మందును ఎక్కువగా తాగడం వల్ల లేనిపోని రోగాలు వస్తాయి. మందు మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. ఇదే గుండె జబ్బులకు ప్రధాన కారణం. అందుకే మందును ఎక్కువగా తాగకూడదు. 
 

99
Image: Getty

వ్యాయామం

గుండె ఆరోగ్యానికి వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. దీంతో మీ శరీరం బాగా చెమట పడుతుంది. ఇందుకోసం మీరు నడవొచ్చు. రన్నింగ్ చేయొచ్చు. లేదా మరేపనైనా కావొచ్చు. ఆఫీసు మెట్లు ఎక్కడం, దిగడం లాంటివి చేయొచ్చు. 

click me!

Recommended Stories