శరీరానికి చలువను అందించే బార్లీ జావను తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Published : Apr 23, 2022, 01:12 PM ISTUpdated : Apr 23, 2022, 01:15 PM IST

బార్లీ గింజలు (Barley grains) తీపి, వగరు రుచులను కలిగి శరీర వేడిని తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది.  

PREV
18
శరీరానికి చలువను అందించే బార్లీ జావను తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

ఈ గింజలతో జావ చేసుకుని తాగితే శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దూరంగా ఉండవచ్చు. ఈ జావను ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు బోలెడు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

28

బార్లీ గింజలలో విటమిన్ ఎ, ఇ ల తో పాటు అనేక విటమిన్లు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, జింక్, ఐరన్, సెలీనియం, మాంగనీస్ వంటి ఇతర ఖనిజాలు మెండుగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచి అనేక అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.
 

38

కనుక బార్లీ గింజలతో ప్రతిరోజూ జావ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు అంటున్నారు. బార్లీ జావ తయారీ కోసం ఒక లీటరు నీటిని (Water) తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ ల బార్లీ గింజలను (Barley grains) వేసి సుమారు 20 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత బార్లీ జావను చల్లార్చి అందులో రుచికోసం కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలిపి తీసుకోవాలి.
 

48

బరువు తగ్గుతారు: ఈ జావలో ఉండే పోషకాలు శరీరంలోని  కొలెస్ట్రాల్ (Cholesterol) ను తగ్గిస్తాయి. అలాగే ఈ జావను తీసుకుంటే శరీరానికి శక్తి లభించి ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీంతో ఆహారం ఎక్కువగా తీసుకోలేరు. కనుక అధిక బరువు (Overweight) సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ బార్లీ జావను తీసుకుంటే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.
 

58

శరీర వేడిని తగ్గిస్తుంది: ఈ జావను తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గి శరీరానికి చలువ అందుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ (Dehydration) బారిన పడకుండా చూస్తుంది. అధిక ఎండ కారణంగా శరీరానికి కలిగే హాని నుంచి కాపాడి వడదెబ్బ (Sunstroke) సమస్యలకు దూరంగా ఉంచుతుంది. కనుక వేసవి కాలంలో కూల్ డ్రింక్స్ కు బదులుగా బార్లీ గింజల జావను తీసుకోవడమే మంచిది.
 

68

జీర్ణ వ్యవస్థ, మలబద్దకం సమస్యలు తగ్గుతాయి: బార్లీ గింజలలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేందుకు సహాయపడుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపులో మంట వంటి సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థ (Digestive system), మలబద్ధకం (Constipation) సమస్యలకు దూరంగా ఉంచుతుంది.
 

78

మధుమేహాన్ని నియంత్రిస్తుంది: మధుమేహంతో బాధపడే వారు బార్లీ జావను తీసుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే బీటా గ్లూకోన్ (Beta glucone) శరీరం గ్లూకోజ్ గ్రహించడానికి ఆలస్యం చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ జావను తీసుకుంటే మధుమేహం (Diabetes) నియంత్రణలో ఉంటుంది.
 

88

అంతేకాకుండా బాలింతలు బార్లీ జావను తీసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే కీళ్ళనొప్పుల (Arthritis) నుండి ఉపశమనం కలుగుతుంది. చర్మ, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే ఈ జావను తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం, రక్తహీనత, క్యాన్సర్, గుండెపోటు (Heart attack) వంటి పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

click me!

Recommended Stories