రోజూ మిరియాలను గనుక తిన్నారంటే ఈ సమస్యలనేవే రావు

R Shivallela | Published : Oct 16, 2023 1:59 PM
Google News Follow Us

మిరియాలు ఒక మసాలా దినుసు. దీనిని ఎన్నో రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. అయితే చాలా మంది వీటిని ఒక మసాలా దినుసులాగే భావిస్తారు. కానీ వీటిని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు తెలుసా? 

17
 రోజూ మిరియాలను గనుక తిన్నారంటే ఈ సమస్యలనేవే రావు
black pepper

చలికాలంలో మీ రోజువారి ఆహారంలో నల్ల మిరియాలను చేర్చితే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాదు ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి. ఇది సంక్రమణను నివారించడానికి సహాయపడుతుంది.

27
black pepper

నల్ల మిరియాలలో విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, సోడియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది పైపెరిన్ అని పిలువబడే బయోయాక్టివ్ సమ్మేళనాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది నల్ల మిరియాలు ఫుడ్ రుచిని పెంచుతాయి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. నల్ల మిరియాలను రెగ్యులర్ గా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

37

జీర్ణ సమస్యలు

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే నల్ల మిరియాలను మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను నివారించడానికి కూడా మిరియాలు ఎంతో సహాయపడతాయి. 
 

Related Articles

47

ఇమ్యూనిటీ 

నల్లమిరియాల్లో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లతో సహా యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి  పెరుగుతుంది. 
 

57

సయాటికా

నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సయాటికాను నివారించడానికి కూడా సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

జలుబు

చలికాలంలో మీ రోజువారి ఆహారంలో నల్ల మిరియాలు చేర్చడం వల్ల తుమ్ములు, దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందుతారు. ఈ మిరియాలు ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
 

67

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు

నల్ల మిరియాలు దగ్గుతో సహా శ్వాసకోశ లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.

పోషకాల శోషణ

ఇతర ఆహారాలతో పాటుగా నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల విటమిన్ బి, విటమిన్ సి, సెలీనియం, బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాల శోషణ పెరుగుతుంది. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనం దీనికి సహాయపడుతుంది.
 

77


వెయిట్ లాస్

బరువు తగ్గాలనుకునే వారికి కూడా నల్ల మిరియాలు ఎంతో సహాయపడతాయి. నల్లమిరియాలకు కేలరీలను తగ్గించే గుణముంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. 

Read more Photos on
Recommended Photos