ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

Navya G   | Asianet News
Published : Dec 28, 2021, 02:22 PM IST

ఆముదం గింజల నుంచి ఆముదం నూనెను తయారు చేస్తారు. ఈ నూనె లేత పసుపు రంగులో చిక్కగా ఉంటుంది. ఆముదం నూనె (Castor oil) ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ఆముదంలో ఉండే ఎన్నో పోషకాలు (Nutrients) ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలగజేస్తాయి. ఆముదం నూనె ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

PREV
17
ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా?

ఆముదం నూనెలో  రిసినోలియెక్ ఆమ్లం (Ricinoleic Acid), ఒమెగా – 6 ఫ్యాటీ ఆమ్లాలు (Omega - 6 fatty acids), యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక ఇన్ఫెక్షన్లను నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. ఆరోగ్య ప్రయోజనం కోసం ఆముదం నూనెను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ (Orange juice) లో రెండు టేబుల్ స్పూన్ ల ఆముదం నూనెను కలిపి తాగితే జీర్ణ వ్యవస్థ శుభ్రం అవుతుంది. ఈ జ్యూస్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.  అలాగే అరగంట తర్వాత గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం (Flatulence), ఎసిడిటీ వంటి  సమస్యలు తగ్గుతాయి. దీంతో ఉదర భాగం ఆరోగ్యంగా ఉంటుంది.

37

కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది: ఆముదం నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతాయి. ఇందుకోసం ఆముదం నూనెలో ఒక మెత్తని వస్త్రాన్ని ముంచి కీళ్ళనొప్పులు (Arthritis) ఉన్న ప్రదేశంలో గట్టిగా చుట్టాలి. తరువాత హాట్ వాటర్ బ్యాగ్ ను నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
 

47

తామర తగ్గుతుంది: ఆముదంలో ఉండే ఆమ్ల గుణాలు తామరను తగ్గించడానికి సహాయపడుతాయి. ఇందుకోసం కొబ్బరి నూనె (Coconut oil), ఆముదం నూనెలను (Castor oil) సమపాళ్లలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తామర ఉన్న ప్రదేశంలో రోజు రాస్తే తామర, గజ్జి వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.  
 

57

నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది: వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి నడుము నొప్పి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇందుకోసం ఆముదం నూనెతో నడుముపై మర్దన (Massage) చేసుకొని హాట్ వాటర్ బ్యాగ్ పెట్టుకుంటే నడుము నొప్పి (Low back pain) నుంచి ఉపశమనం కలుగుతుంది.
 

67

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది: బాగా మరిగించిన నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఆముదాన్ని కలిపి తాగితే మెటబాలిజం (Metabolism) ప్రక్రియ మెరుగుపడుతుంది. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచిది. ఇలా వారానికి ఒకసారి తాగిన జీర్ణవ్యవస్థ (Digestive system) పనితీరు మెరుగుపడుతుంది.
 

77

ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడుతుంది: ఆముదంలో రిసినోలియెక్ ఆమ్లం ఉంటుంది. ఇది తగిలిన గాయాల నుంచి ఇన్ఫెక్షన్ (Infection) లు రాకుండా కాపాడుతుంది. కనుక గాయం (Injury) తగిలిన ప్రదేశంలో ఆముదం నూనె రాస్తే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.

click me!

Recommended Stories