నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఇది మన ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలుసా?

Published : Jul 18, 2023, 11:44 AM IST

మన దేశంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే ఇది ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పసుపునే మనం ఉపయోగిస్తాం. కానీ నల్ల పసుపు కూడా ఉంది తెలుసా? ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.   

PREV
15
నల్ల పసుపును ఎప్పుడైనా తిన్నారా? ఇది మన ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తుందో తెలుసా?

నల్ల పసుపును ఎక్కువగా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో పండిస్తారు. ఈ నల్ల పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మన చర్మానికి కూడా ప్రయోజకరంగా ఉంటుంది. అసలు ఈ నల్ల పసుపు మనకు ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

25

మెరుగైన జీర్ణక్రియ

నల్ల పసుపు మన జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. ఇది ఉదర సమస్యలను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేసుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. ఇందుకోసం నల్ల పసుపు పొడిని నీళ్లలో కలిపి తాగండి. 

35

Black Turmeric

కీళ్ల నొప్పులు

వయపు పెరుగుతున్న కొద్దీ ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువగా వస్తాయి. అయితే నల్ల పసుపు ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షనాలున్న నల్ల పసుపును కీళ్ల నొప్పులకు అప్లై చేస్తే కాస్త ఉపశమనం పొందుతారు. ఇందుకోసం నల్ల పసుపులో కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లా చేసి పెట్టాలి. 
 

45

చర్మ ఆరోగ్యం

నల్ల పసుపు కూడా చర్మానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పసుపు మొటిమలను, నల్ల మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అలాగే ముఖానికి అంటుకున్న మురికిని కూడా పోగొడుతుంది. ఇందుకోసం కొద్దిగా నల్ల పసుపును తీసుకుని అందులో తేనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 
 

55

గాయాలు తొందరగా తగ్గుతాయి

గాయాలు తగ్గడానికి మనం ఎన్నో రకాల స్కిన్ క్రీమ్స్ ను వాడుతుంటాం. అయితే గాయాలు సహజంగా తగ్గాలంటే మాత్రం నల్ల పసుపును ఉపయోగించండి.  ఇందుకోసం నల్ల పసుపును పేస్ట్ గా చేసి ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. ఇది మీ గాయలను త్వరగా నయం చేస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories