Health Tips: బొల్లి, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. ఆయుర్వేదంతో అదుపులో పెట్టండిలా?

Navya G | Published : Jul 18, 2023 11:00 AM
Google News Follow Us

Health Tips: బొల్లి మచ్చలు తెల్ల మచ్చల ని భరించడం చాలా కష్టం అవి చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంటాయి. అయితే ఇలాంటి వ్యాధిని ఆయుర్వేదంతో అదుపులో పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అది  ఎలాగో చూద్దాం.
 

16
Health Tips: బొల్లి, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా.. ఆయుర్వేదంతో అదుపులో పెట్టండిలా?

 సాధారణంగా బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు వచ్చాయి అంటే అవి ఒక దగ్గర ఉండకుండా శరీరం మొత్తం పాకి పోతుంది ఇది మెలనిన్ కారణంగా జరుగుతుంది. మెలనిన్ అనేది మన చర్మానికి రంగుని అందిస్తుంది. అయితే దీనికి ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్యం ఉంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
 

26

 ఈ విధానం వలన వ్యాధి పూర్తిగా తగ్గుతుంది లేదంటే పెరగకుండా ఉంటుంది అది మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాధి కుళ్ళిపోయిన మాంసము, చేపలు లేదంటే ఆహారం పరిశుభ్రమైనది కాకపోవటం వలన వస్తుంది.
 

36

కాబట్టి ఎలాంటి ఆహారం తినాలో ఒకసారి చూడండి గోధుమలు, బార్లీ, ముందు మసూరి పప్పు తినండి. 8 గంటలపాటు రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగండి క్యారెట్లు పొట్లకాయ ఆకుకూరలు ఎక్కువగా తినండి.
 

Related Articles

46

రోజు 30 నుంచి 50 గ్రాముల నానబెట్టిన నల్ల బెల్లం మరియు మూడు నుంచి నాలుగు బాదం పప్పులు తినండి అలోవెరా జ్యూస్ కూడా తెల్ల మచ్చలకి మంచి మందు. అలాగే ఎండబెట్టి మెత్తగా చేసుకున్న వేపాకుని తీసుకోవడం కూడా చాలా మంచిది.
 

56

ఎలాంటి పదార్థాలు తినకూడదు ఒకసారి చూడండి కూరగాయ వెనిగర్ పెరుగు యాలకుల పొడి చింతపండు నిమ్మకాయలను మీ దరిదాపుల్లో కూడా రానివ్వకండి అలాగే ఉప్పు కారం ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోకండి.
 

66

నాన్ వెజ్ వంటకాలలో పాలు కలవకుండా చూసుకోండి పాల ఉత్పత్తులు ఎంత వీలైతే అంత తగ్గించండి. నువ్వులు బెల్లం పాలు కలిపి  తినకూడదు. అలాగే మీ తెల్లని మచ్చలు దురదగా ఉన్నట్లు అనిపిస్తే మీ గోళ్ళ తో గోకకండి. అన్నింటికన్నా ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకోండి.

Recommended Photos