తమలపాకు, తేనే కలిపి తీసుకుంటే ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయ్.. ఎలాంటి ఫలితం దక్కుతుంది?

First Published Oct 14, 2021, 8:46 PM IST

ఆకులలో తమలపాకు (Betel leaves) ఒక ముఖ్యమైన ఆకు. ఈ ఆకును పూజకు వాడుతాం. అంతేకాకుండా తాంబూలం గా స్వీకరిస్తాం. ఇక ఇందులో ఎన్నో ఔషధగుణాలు, పోషక (Vitamins, Proteins) విలువలు ఉన్నాయి. 

ఆకులలో తమలపాకు (Betel leaves) ఒక ముఖ్యమైన ఆకు. ఈ ఆకును పూజకు వాడుతాం. అంతేకాకుండా తాంబూలం గా స్వీకరిస్తాం. ఇక ఇందులో ఎన్నో ఔషధగుణాలు, పోషక (Vitamins, Proteins) విలువలు ఉన్నాయి. ఇది తినడం వల్ల శరీరంలో ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ఇక అవేంటో తెలుసుకుందాం.
 

తమలపాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్ (Vitamin A, Vitamin C) పుష్కలంగా ఉంటాయి. తమలపాకు యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వీటిని రోజు తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ (Diabetic) అదుపులో ఉంటుంది.
 

తమలపాకును తేనె (Betel leaves, Honey) కలిపి తీసుకుంటే దగ్గు సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోశ సంబంధ నుంచి విముక్తి లభిస్తుంది. తమలపాకును వేడిచేసి గాయాలు, వాపులపై (Swelling)పెడితే వెంటనే విముక్తి కలుగుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గాలంటే పరిగడుపున తమలపాకులు నమిలి మింగాలి.
 

తమలపాకు రసం తరుచు తీసుకుంటుంటే ముఖంపైన  ఉండే మచ్చలు, మొటిమలు, (Pimples) ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ప్రతి రోజు తమలపాకును (Betel Leves)10 గ్రాముల మిరియాలు కలిపి తినడం వల్ల బరువు తగ్గుతారు. తమలపాకు రసంలో నిమ్మరసం (Lemon Juice) కలిపి పరగడుపున తాగితే షుగర్ లెవల్  కంట్రోల్ లో ఉంటుంది.
 

చిన్నపిల్లల్లో జలుబు (Cold) ఎక్కువగా ఉన్నపుడు తమలపాకుని వేడిచేసి ఆముదంతో చేర్చి ఛాతీమీద ఉంచితే జలుబు కూడా తగ్గుతుంది. తమలపాకు (Betel Leves) పేస్టును తలకు పట్టించుకుని రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
 

మగవారిలో లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.
చెవులపైనా తమలపాకులు కాసేపు ఉంచితే కఫము తగ్గి తలనొప్పి(మైగ్రేయిన్) (Maigrain)తగ్గుతుంది. తమల పాకులు నమిలి పుక్కిలించడం వలన నోటి పగుళ్లు, చిగుళ్ల నొప్పులు, చిగుళ్లనుంచి రక్తస్రావం తగ్గుతాయి.

తమలపాకులో (Betel Leaves) చెవికల్ అనే పదార్థం ఉంటుంది. చెవికల్ అనే పదార్థం శరీరంలో ఉన్న బ్యాక్టీరియాను చంపుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే అధికంగా తాంబూలం తీసుకొనుట వలన కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
 

అధిక రక్తపోటు (Blood Pressure) ఉన్నవారు తాంబూలాన్ని తగ్గించాలి. తొడిమతో తినడం వల్ల స్త్రీలలో వందత్వం వస్తుంది. అంటే పిల్లలు పుట్టరు. అందువల్ల సంతానం కావాలనుకునేవారు తొడిమ తీసి తినాలి. కాబట్టి తమలపాకులు (Betel Leaves) మితంగా తీసుకోవడం మంచిది.

click me!