రోజూ ఒక గుడ్డును తింటే..!

First Published Jun 4, 2023, 1:53 PM IST

గుడ్డు సంపూర్ణ ఆహారం. గుడ్డులో మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. గుడ్డును తింటే ఒత్తిడి తగ్గడం నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో ఆరోగ్య  ప్రయోజనాలు కలుగుతాయి. 
 

గుడ్లు ఎన్నో పోషకాలను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం. ఒక గుడ్డులో సుమారు 7 గ్రాముల అధిక-నాణ్యతున్న ప్రోటీన్, 5 గ్రాముల మంచి కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు, ఇనుము వంటి బహుళ సూక్ష్మపోషకాలు  పుష్కలంగా ఉంటాయి.

Image: Getty

గుడ్లను తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటో తెలుసా? ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ ట్రిప్టోఫాన్ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే శరీరంలోని హార్మోన్ల రుగ్మతలను తగ్గిస్తుంది.
 

Image: Getty

గుడ్లలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుది. ఇలాంటి గుడ్లను తినడం వల్ల ఎముకలు, మెదడు కణాల పనితీరు మెరుగుపడుతుంది. గుడ్లను తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. గుడ్డు బరువు తగ్గడానికి రెండు విధాలుగా పనిచేస్తుంది. మొదటిది ఇది కడుపు కదలికను పెంచుతుంది. రెండోది దీనిలోని ప్రోటీన్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది మీ కండరాలను బలోపేతం చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కూడా కాపాడుతుంది.

Image: Getty

గుడ్లు ప్రోటీన్ కు మంచి మూలం. వీటిలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. అంతేకాదు గుడ్లలో విటమిన్ బి 6, విటమిన్ బి 12, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తోంది.

Image: Getty

గుడ్లలో విటమిన్ బి 12, విటమిన్ బి 5, బయోటిన్, రిబోఫ్లేవిన్, థయామిన్, సెలీనియం వంటి బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లన్నీ మీ చర్మం, జుట్టు, గోళ్లకు ఎంతో మేలు చేస్తాయి. గుడ్లలో లుటిన్, సెసంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుడ్లలో ఉండే లుటిన్, సెసంతిన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

click me!