కూరగాయల జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

First Published Oct 21, 2021, 9:01 PM IST

మనం నిత్యం వంటలలో ఎన్నో ఆకుకూరలు, కాయగూరలు (Greens,Vegetables) వాడుతుంటాము. అవన్నీ మనకు పోషకాలను, శక్తిని (Energy) అందిస్తాయి. కూర‌గాయ‌లు, ఆకుకూర‌లో భిన్న‌మైన పోష‌కాలు ఉంటాయి. దాంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందేందుకు అవకాశం ఉంటుంది. 

మనం నిత్యం వంటలలో ఎన్నో ఆకుకూరలు, కాయగూరలు (Greens,Vegetables) వాడుతుంటాము. అవన్నీ మనకు పోషకాలను, శక్తిని (Energy) అందిస్తాయి. కూర‌గాయ‌లు, ఆకుకూర‌లో భిన్న‌మైన పోష‌కాలు ఉంటాయి. దాంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి కూర‌గాయ‌ల జ్యూస్‌ల‌ను  తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 

టమోటా జ్యూస్ (Tomato) ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో సమృద్ధిగా ఉండే విటమిన్ ఏ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుక‌లు (Skin, Hair) సంర‌క్షింప‌బ‌డ‌తాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. జీర్ణ ప్రక్రియ మెరుగు ప‌డుతుంది. ఇందులో ఉన్న అధిక ఫైబర్ వల్ల శరీర బరువు తగ్గుతుంది. 
 

పాల‌కూర (Spinach) జ్యూస్ శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్సర్ క‌ణాలను నాశ‌నం చేస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. ఆర్థ‌రైటిస్ (Arthritis) స‌మ‌స్య ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌టప‌డ‌వ‌చ్చు. చర్మానికి, జుట్టుకు కావలసిన పోషకాలను అందిస్తుంది. 
 

క్యారెట్ జ్యూస్ (Carrot juice) ఆరోగ్యానికి ఎంతో మంచిది. అధిక బ‌రువును తగ్గిస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి కలుగుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ త‌గ్గుతుంది. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. రోగ నిరోధ‌క శ‌క్తి (Immunity) పెరుగుతుంది.
 

బీట్ రూట్ జ్యూస్ (Beat root) తాగడం వల్ల రక్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. శ‌క్తి (Energy) పెరుగుతుంది. కండ‌రాలు దృఢంగా మారుతాయి. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. క్యాన్స‌ర్ లు రాకుండా ఉంటాయి.
 

చిలకడదుంప జ్యూస్ (Sweet potato) తాగడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. జీర్ణాశ‌యంలో ఉండే అల్స‌ర్ లు త‌గ్గుతాయి. అసిడిటీ (Acidity) స‌మ‌స్య దరి చేరనివ్వదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
 

క్యాబేజ్ జ్యూస్ (Cabbage Juice) తాగడం వల్ల శరీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు (cancer, Heart) దరిచేరవు. శ‌రీరం శుభ్ర‌మ‌వుతుంది. చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

click me!