ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినడం మానేయండి..

Published : Mar 31, 2023, 01:19 PM ISTUpdated : Mar 31, 2023, 01:20 PM IST

మనం తినే ఫుడ్ తోనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఎనర్జీ వస్తుంది. కానీ కొన్ని రకాల ఆహారాలను తింటే మాత్రం వాంతులు, వికారం వంటి ఎన్నో సమస్యలొస్తాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు.

PREV
14
ఫిట్ గా , ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినడం మానేయండి..

పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రతిరోజూ తగిన మొత్తంలో తినకపోతే మన శరీరంలో పోషకాలు, ఖనిజాలు లోపిస్తాయి.  దీంతో రక్తహీనత, బలహీనత వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన ఫుడ్ ను ఖచ్చితంగా తినాలి. అలాగని ఏలా పడితే అలా అసలే తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు మన శరీరాన్ని దెబ్బతీస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. కొన్ని ఆహారాలలో టాక్సిన్స్ ఉంటాయి. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అసలు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

24
Image: Getty Images

పచ్చి బంగాళాదుంపలు

ఆకుపచ్చ బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం ప్రాణాంతకమే కాదు ప్రమాదకరం కూడా. ఆకుపచ్చ బంగాళాదుంపలలో సోలనేసి అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తలనొప్పి, వాంతులు, వికారం, అంతర్గత రక్తస్రావం, కోమా, మరణం వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. వీటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక పరిశోధన ప్రకారం.. 450 గ్రాముల పండని బంగాళాదుంప తినడం ప్రాణాంతకం. 
 

34
Image: Getty Images

జాజికాయ

జాజికాయలో మిరిస్టిసిన్ అనే క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో విచ్ఛిన్నమైనప్పుడు నాడీ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. ఒకేసారి 10 గ్రాముల జాజికాయ తినడం వల్ల తలనొప్పి, మైకము, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే జాజికాయలను అతిగా తినకూడదు.
 

44
bitter almonds dangerous

చేదు బాదం

చేదు బాదంలో విషపూరితమైన హైడ్రోజన్ సైనైడ్ అనే పదార్థం ఉంటుంది. వీటిని 6-10 తినడం విషపూరితంగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక వీటిని 20-25 తినడం ప్రాణాంతకం. అందుకే చేదు బాదంలను తినకపోవడమే మంచిది.

click me!

Recommended Stories