గుడ్డులో ఉండే పోషకాలు జుట్టు ఒత్తుగా, పొడవుగా, వేగంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. ఈ పోషకాలు (Nutrients) జుట్టును, జుట్టు కుదుర్లను బలపరిచి జుట్టురాలే సమస్యలను తగ్గించడంతోపాటు చుండ్రు, దురద మంట వంటి ఇన్ఫెక్షన్ లను కూడా తగ్గిస్తాయి. కనుక ఎక్కువ ఖర్చుతో కూడిన హెయిర్ ప్యాక్స్ (Hair packs) కు బదులుగా ఇలా ఇంటిలోనే తక్కువ ఖర్చుతో చేసుకునే గుడ్డుతో హెయిర్ ప్యాక్స్ ను ప్రయత్నించండి.. జుట్టుకు మంచి ఫలితాలను పొందండి..