ముడతలు రాకుండా యవ్వనంగా ఉండేలా చేసే బెస్ట్ బ్యూటీ టిప్ ఇదే..!

First Published Jan 22, 2022, 1:49 PM IST

చర్మ సౌందర్యం కోసం  అనేక వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా! అయినా తగిన ఫలితం లభించడం లేదా! అయితే అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే గ్లిజరిన్ తో చర్మ సౌందర్యం మెరుగుపడుతుందని మీకు తెలుసా..చర్మ సౌందర్యం కోసం గ్లిజరిన్ (Glycerin) మంచి మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్ గా సహాయపడుతుంది. ఇప్పుడు మనం గ్లిజరిన్ తో కలిగే బ్యూటీ బెనిఫిట్స్ (Beauty Benefits) గురించి తెలుసుకుందాం..
 

పెట్రోలియం నుండి గ్రహించే ఒక నేచురల్ ప్రొడక్ట్స్ గ్లిజరిన్. చర్మ సంరక్షణ (Skin care) కోసం  గ్లిజరిన్ ను ఉపయోగిస్తే చర్మం తేమను కోల్పోకుండా చూస్తుంది. చర్మం పొడిబారే సమస్యలను తగ్గించడంతోపాటు మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి చర్మ సమస్యలు పూర్తిగా తగ్గించడానికి మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా (Beauty product) సహాయపడుతుంది.
 

ఇది చర్మానికి మంచి నిగారింపును అందించడంతో పాటు చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ఇది చర్మ సౌందర్యం (Skin beauty) కోసం  సహజసిద్ధమైన సౌందర్య లేపనంగా సహాయపడుతుంది. గ్లిజరిన్ జుట్టుకు మంచి హెయిర్ కండీషనర్ (Hair conditioner) గా కూడా సహాయపడుతుంది. ఇలా గ్లిజరిన్ చర్మానికి అందించే ప్రయోజనాలు అనేకం.
 

మొటిమలను తగ్గిస్తుంది: ఒక కప్పులో ఒక స్పూన్ బోరిక్ యాసిడ్ పౌడర్ (Boric acid powder), సగం స్పూన్ గ్లిజరిన్ (Glycerin), ఒక స్పూన్ కర్పూరం పౌడర్ (Camphor powder) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత  చల్లటి నీటితో శుభ్రపరచుకుంటే ముఖంపై మొటిమలు క్రమంగా తగ్గుతాయి.
 

ముడతలు తగ్గుతాయి: ఒక కప్పులో ఒక స్పూన్ గ్లిజరిన్ (Glycerin), ఒక స్పూన్ తేనె (Honey), ఎగ్ వైట్ (Egg white) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మర్దన చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
 

పెదాలకు మాయిశ్చరైజర్ గా సహాయపడుతుంది: రాత్రి నిద్రించే ముందు గ్లిజరిన్ (Glycerin) ను  పెదాలకు అప్లై చేసుకొని పడుకుంటే పెదాలు మృదువుగా మారుతాయి. తగిన తేమ అంది పొడిబారకుండా ఉంటాయి. పెదాలకు  గ్లిజరిన్ మంచి మాయిశ్చరైజర్ (Moisturizer) గా సహాయపడుతుంది.
 

క్లెన్సర్ గా సహాయపడుతుంది: ఒక కప్పులో ఒక స్పూన్ గ్లిజరిన్ (Glycerin), ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్స్ తో  ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత  నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది చర్మంలోని మలినాలను తొలగించి చర్మాన్ని తాజాగా ఉంచడానికి మంచి క్లెన్సర్ గా సహాయపడుతుంది.
 

హెయిర్ కండీషనర్ గా సహాయపడుతుంది: గ్లిజరిన్ (Glycerin) ను జుట్టుకు హెయిర్ కండీషనర్ (Hair conditioner) గా అప్లై చేసుకుంటే జుట్టు కుదుళ్లకు కావలసిన తేమ అందుతుంది. గ్లిజరిన్ జుట్టును మృదువుగా మార్చడంతో పాటు ఆరోగ్యంగా, బలంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

click me!