వక్క తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 18, 2024, 3:46 PM IST

వక్క పొడి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. చాలా మంది ఆకు వక్కను బాగా తింటుంటారు. దీన్ని పాన్ లో కూడా ఉపయోగిస్తారు. కానీ ఇది ఒక క్యాన్సర్ కారకం. అవును దీన్ని తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

వక్క పొడిని పాన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే తమలపాకుతో కూడా దీన్ని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. టేస్ట్ కోసం తినే ఈ వక్క మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాన్ని కలిగిస్తుందో మీరు తెలుసుకుంటే దీన్ని తినే సాహసం అస్సలు చేయరు తెలుసా? 

అవును వక్క ఒక క్యాన్సర్ కారకం. దీని వాడకం తగ్గిస్తే ప్రపంచంలో నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుబంధ సంస్థ ఇటీవల నివేదించింది. వక్క వాడకంపై నిషేధం విధించాలని నివేదిక సిఫారసు చేయడంతో.. ఇప్పుడు రైతులు పొగాకు మాదిరిగానే వక్క పంట నియంత్రణ చర్యలు చేపడతారని ఆందోళన చెందుతున్నారు.
 

areca nut


ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ (ఐఎఆర్సి) అక్టోబర్ 9, 2024 న విడుదల చేసిన ఒక నివేదికలో వక్క గింజల క్యాన్సర్ కారకమని మరోసారి  తెలిపింది. అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ ఆంకాలజీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 

ఐఎఆర్ సి నోటి క్యాన్సర్ పై పరిశోధనలు జరుపుతోంది. అలాగే ప్రతి ఐదేంట్లకోసారి ప్రపంచ క్యాన్సర్ నివేదికను ప్రచురిస్తోంది. ఇంతకుముందు ఐఏఆర్సీ నివేదికల్లో కూడా వక్క క్యాన్సర్ కారకమని పేర్కొన్నది. అయినప్పటికీ ప్రస్తుత నివేదిక కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. 
 


Areca

వక్క పంట నియంత్రణకు సిఫార్సు

ఒక్క పొగాకు కలిపిన వక్క పంటను నియంత్రించడమే కాకుండా.. డైరెక్ట్ గా వక్క పంటను కూడా నియంత్రించాలని ఐఏఆర్సీ నివేదిక ప్రతిపాదించింది. పొగలేని పొగాకు, వక్క వాడకాన్ని తగ్గిస్తే ప్రపంచంలో మూడింట ఒక వంతు నోటి క్యాన్సర్లను నివారించవచ్చని నివేదిక వెల్లడించింది. 

ప్రపంచ వ్యాప్తంగా పొగలేని పొగాకు వల్ల ఏటా 1,20,200 నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 83,400 కేసులు భారత్ లోనే ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2022లో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఎక్కువ భాగం ఉత్తర భారతదేశంలోనే జరిగింది. 

areca nut

ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మంది పొగలేని పొగాకుకు బానిసలయ్యారు. అలాగే వక్కను 600 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. వక్కలు దక్షిణ మధ్య ఆసియా, ఆగ్నేయాసియాతో పాటుగా ఇతర చాలా ఇతర దేశాల్లో బాగా వాడుతున్నారు. పొగాకు, వక్కలు ఎన్నో రకాలుగా అందుబాటులో ఉన్నాయి. 

వక్క, పొగాకు, గుట్కా వంటి ఉత్పత్తులను ఎక్కువగా వాడటం వల్ల ఆసియా దేశాల్లో భారత్ లో నోటి క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారని నివేదిక వెల్లడిస్తోంది.  పొగరాని పొగాకు, వక్క వాడకం వల్ల వచ్చే నోటి క్యాన్సర్ కేసుల్లో భారత్ లో 83,400, బంగ్లాదేశ్ లో 9,700, పాకిస్థాన్ లో 8,900, చైనాలో 3,200, మయన్మార్ లో 1,600, శ్రీలంకలో 1,300, ఇండోనేషియాలో 990, థాయ్ లాండ్ లో 785 కేసులు నమోదయ్యాయి.
 

areca nut

వక్క పంటపై ప్రభావం

వక్క క్యాన్సర్ కారకమనే అంశం గతకొన్నేండ్ల నుంచి సుప్రీంకోర్టులో నడుస్తోంది. 1998 నుంచి వక్కను అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్ లో హానికరమైందిగా పేర్కొన్నారు. అయితే వక్క ఆరోగ్యకరమైనదని దీన్ని సాంప్రదాయకంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అంతేకాదు ఇది విలువ ఆధారిత ఉత్పత్తిగా కూడా ఉపయోగించబడుతుందని నిరూపించబడింది. అలాగే మార్కెట్ అధ్యయనాలు కూడా వక్క క్యాన్సర్ కాదని సూచించాయి. కానీ ఇది తప్పని ఐఎఆర్సి వెల్లడించింది. 

Latest Videos

click me!