డయాబెటీస్ ఉన్నవారికి ఈ డ్రై ఫ్రూట్స్ విషంతో సమానం..

First Published | Nov 16, 2024, 10:05 AM IST

డ్రై ఫ్రూట్స్ పోషకాలకు మంచి వనరులు. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ తింటారు. కానీ డయాబెటీస్ ఉన్నవారు మాత్రం కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ ను బాగా పెంచుతాయి. అవేంటంటే?

dry fruits

డ్రై ఫ్రూట్స్ లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని ఆరోగ్య సంపదగా భావిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే వీటిని మన రోజువారి ఆహారంలో ఖచ్చితంగా చేర్చాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను తినకపోవడమే మంచిది. 

Diabetes Diet

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఏయే డ్రై ఫ్రూట్స్ ను తినకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలు తీయగా, టేస్టీగా ఉంటాయి. కానీ వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

వీటిని డయాబెటీస్ ఉన్నవారు తింటే మాత్రం వారి రక్తంలో వెంటనే చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఎండుద్రాక్షలను ఎక్కువగా తినకూడదు. లేదా మొత్తమే తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే తినాలి. 


ఖర్జూరాలు 

ఖర్జూరాలు మంచి హెల్తీ డ్రై ఫ్రూట్స్. ఈ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి. మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ డయాబెటీస్ ఉన్నవారు మాత్రం ఖర్జూరాలకు దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీళ్లు మర్చిపోయి ఖర్జూరాలను తింటే మాత్రం వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Dried Apricots

ఆప్రికాట్ 

డయాబెటీస్ పేషెంట్లు ఆప్రికాట్ ను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే శరీరం ఇన్సులిన్ కు నిరోధకతను కలిగిస్తాయి.

ఈ పండును తింటే రక్తంలో చక్కెర కణాల్లోకి ప్రవేశించడం కష్టమవుతుందని దీనివల్ల మధుమేహం పెరుగుతుందంటున్నారు నిపుణులు. అందుకే మధుమేహులు ఆప్రికాట్ ను ఎక్కువగా తినకూడదు. 

Dried Figs

అంజీర్

అంజీర్ పండులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో పాటుగా రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై అంజీర్ ను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.  

అందుకే ఈ పండ్లను ఆరోగ్య నిధిగా భావిస్తారు. కానీ ఈ పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను డయాబెటీస్ పేషెంట్లకు హానికరంగా భావిస్తారు. డ్రై అంజీర్ పండ్లను మధుమేహులు చాలా తక్కువగా తినాలి. 

Latest Videos

click me!