ప్రతిరోజూ పాలు (Milk) తాగితే శరీర ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు చర్మ సౌందర్యం (Skin beauty) కూడా మెరుగుపడుతుంది. పాలలో అధిక మొత్తంలో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. చర్మ సౌందర్యం కోసం బయట దొరికే రసాయన క్రీమ్స్ ల వాడకం తగ్గించి పాలతో ముఖానికి ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకుంటే చర్మ సౌందర్యం మెరుగు పడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మెరిసే కాంతివంతమైన చర్మ సౌందర్యం కోసం పాలు ఏవిధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..
పాలలో ఉండే లాక్టిక్ ఆమ్లము (Lactic acid) చర్మ సౌందర్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. కలుషిత వాతావరణం (Polluted atmosphere) కారణంగా చర్మంలో పేరుకుపోయిన మురికిని, మృతకాణాలను బయటకు పంపించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
28
చర్మంపై ఏర్పడే మొటిమలు (Pimples) వాటి తాలుకు మచ్చలను తొలగించి చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది. పాలు ఒక అద్భుతమైన బ్యూటీ ప్రొడక్ట్ (Beauty product) గా ఉపయోగపడుతుంది. అయితే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి పాలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకుందాం..
38
పొడి చర్మం కోసం: పొడి చర్మ సమస్యలతో బాధపడే వారికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ ల పచ్చిపాలలో (Milk) ఒక టేబుల్ స్పూన్ తేనె (Honey) కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని దూదిపింజల సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవాలి.
48
అప్లై చేసుకున్న 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడంతో పొడి చర్మ సమస్యలు (Dry skin problems) తగ్గి చర్మానికి తగినంత తేమ అందుతుంది. చర్మం కాంతివంతంగా (Brightens the skin) మారుతుంది.
58
మొటిమలను, మచ్చలను తగ్గిస్తుంది: మొటిమలు మచ్చలను తగ్గించుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేస్తే సరిపోతుంది. ఒక కప్పులో పాలు (Milk) తీసుకొని అందులో దూది పింజల్ని (Cotton pinch) నాన బెట్టాలి. ఈ దూదిపింజల సహాయంతో పాల మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.
68
అప్లై చేసుకున్న 15 నిమిషాల తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరచుకోవాలి. ఇలా తరచూ చేయడంతో మొటిమలు (Pimples), మచ్చలు (Spots), బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
78
మృతకణాలను తగ్గిస్తుంది: కలుషిత వాతావరణం కారణంగా చర్మంలో పేరుకుపోయిన మురికిని, మృతకణాలను తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందుకోసం ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ పాలు (Milk), ఒక టేబుల్ స్పూన్ పసుపు (Turmeric) తీసుకొని బాగా కలుపుకోవాలి.
88
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్ర పరచుకోవాలి. ఇలా చేయడంతో చర్మకణాలలో (Skin cells) పేరుకుపోయిన మురికి, మృతకణాలు (Dead cells) తొలగిపోతాయి. చర్మం తాజాగా మారుతుంది. చర్మం మంచి నిగారింపును పొందుతుంది. చర్మ సహజ సౌందర్యం మెరుగుపడుతుంది.