ఆవాలతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Navya G   | Asianet News
Published : Dec 15, 2021, 02:05 PM IST

ఆవాలు (Mustard) అందరి వంట గదిలో అందుబాటులో ఉండే పోపుదినుసు. ఆవాలలో అనేక పోషక పదార్థాలతో పాటు ఔషధగుణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చూడడానికి పరిమాణంలో చిన్నగా ఉన్న దీంతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని. శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. ఆవాలను ఊరగాయలు, పచ్చళ్లు, పోపులలో ఎక్కువగా వాడుతుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా ఆవాలతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) గురించి తెలుసుకుందాం..

PREV
19
ఆవాలతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఆవాలలో ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు, ఐరిన్‌, జింక్‌, మాంగనీస్‌, కాల్షియం, మెగ్నీషియం, పీచుపదార్దములు (Fibers) పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ఆవాలలో పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. అయితే ఆవాలను వంటలలో వాడడంతో  శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
 

29

జీర్ణశక్తి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి: ఒక టీ స్పూన్ ఆవాల పొడిని (Mustard powder) తీసుకుంటే జీర్ణశక్తి (Digestion) మెరుగుపడుతుంది. అలాగే పేగుల్లో పెరిగిపోయిన మలం తేలికపడి మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.
 

39

శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి: శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఆవాల పొడి చక్కగా పనిచేస్తుంది. ఆవాల పొడిని (Mustard powder) తేనెతో (Honey) కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
 

49

పులిపిర్లను తగ్గిస్తుంది: ఆవాలను నూరి ఆ మిశ్రమాన్ని పులిపిర్లు (warts) ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే పులిపిర్లు ఎండిపోయి రాలిపోతాయి. పులిపిర్లను తగ్గించడానికి ఆవాలు మంచి ఔషధంగా (Medicine) పనిచేస్తాయి.
 

59

కీళ్ల నొప్పులు తగ్గుతాయి: వయసుతో సంబంధం లేకుండా కీళ్లనొప్పులు (Arthritis) అందరిలో సర్వసాధారణమైపోయాయి. ఆవాల ముద్దలో కర్పూరము (Camphor) కలిపి ఆ మిశ్రమాన్ని కీళ్ళ నొప్పులు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే కీళ్ళ నొప్పుల నుంచి  ఉపశమనం కలుగుతుంది
 

69

జ్వరాన్ని తగ్గిస్తుంది: జ్వరం (Fever) ఉన్నప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో చిటికెడు ఆవాల పొడి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిలో తేనె (Honey) వేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది.
 

79

జుట్టు సమస్యలు తగ్గుతాయి: ఆవాల పొడితో జుట్టును శుభ్రపరుచుకుంటే జుట్టు సౌందర్య (Hair cosmetics) మెరుగుపడుతుంది. జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు (Dandruff) వంటి సమస్యలు తగ్గుతాయి.
 

89

కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: ఆవాలలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ (Cholesterol) స్థాయిలను అదుపులో ఉంచడానికి చక్కగా సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
 

99

మొటిమలను తగ్గిస్తుంది: కొబ్బరి నూనెలో (Coconut oil) ఆవాలు (Mustard) వేయించి చల్లారిన తర్వాత వడగట్టి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను ముఖానికి పట్టించి ఉదయాన్నే కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి.

click me!

Recommended Stories