
స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగితే ఆరోగ్యానికి ముప్పు అని వైద్యులు అంటున్నారు. వీటి వాడకం పెరగడంతో చాలా మందిలో దీని ప్రభావం మెదడుపై పడి తలనొప్పి (Headache) సమస్యలకు కారణం అవుతుంది. మరి ఇలా తలనొప్పి రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తలనొప్పి రావడానికి రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే రేడియో తరంగాల (Radio waves) ప్రభావం మెదడు కణాలపై ప్రభావితం చూపుతుంది. దీంతో మెదడు కణాలు వేడెక్కుతాయి. ఫలితంగా ఎక్కువగా ఆవలింతలు రావడం, అలసిపోయినట్టు ఉండడం, నొప్పిగా అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. ఇలా వేడి పెరిగే కొద్దీ మెదడు కణాలు (Brain cells) తట్టుకోలేవు.
దీంతో మెదడు కణాల వేడి అంతర్గతంగా పెరుగుతుంది. దీంతో తలనొప్పి ఏర్పడుతుంది. నెట్ సెల్ ఫోన్ రేడియేషన్ (Radiation) ప్రభావం తలలో ఉండే రక్త కణాలపై (Blood cells) ప్రభావితం చూపి ముడుచుకునేలా చేస్తాయి. ఇలా జరిగితే మెదుడు కణాలకు జరిగే రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. కణాలు వ్యాకోచిస్తేనే రక్త సరఫరా బాగా పెరుగుతుంది. ముడుచుకుపోతే రక్తప్రసరణ తగ్గుతుంది.
ఇలా రక్త కణాలు ముడుచుకుపోవడంతో ఒత్తిడి (Stress) పెరుగుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది. ఇలా రెండింటి కారణాలతో చాలామందిలో తలనొప్పి వస్తుందని ఇందుకు కారణం సెల్ ఫోన్ వాడకమే వైద్యులు అంటున్నారు. రేడియో తరంగాలు, రేడియేషన్ ప్రభావంతో మెదడు లేదా శరీరంలోని డిఎన్ఏ (DNA) బలహీనపడుతుంది. దీంతో బలహీనంగా ఉన్న డిఎన్ఏ మరింత బలహీనపడుతుంది.
ఇలా జరిగితే కణాల జీవితకాలం (Lifespan of cells) తగ్గిపోతుంది. కొత్త కణాలు తిరిగి ఆరోగ్యంగా ఉండాలంటే డిఎన్ఏ ఆరోగ్యంగా ఉండాలి. కానీ సెల్ ఫోన్స్ వాడకం పెరగడంతో డిఎన్ఏ బలహీనపడి (Weakened) అది కూడా తలనొప్పికి దారితీస్తుంది. కనుక ఇలాంటి నష్టాలకు దూరంగా ఉండాలంటే సెల్ ఫోన్స్ వాడకాన్ని సాధ్యమైనంతవరకు తక్కువగా ఉపయోగించాలి. ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకున్న వీటి ప్రభావం మెదడుపై పడుతుంది.
కానీ డైరెక్ట్ గా ఫోన్ ను చెవి దగ్గర పెట్టుకోవడం కంటే వీటిని ఉపయోగం కొంతవరకు మంచిది. సెల్ ఫోన్ రేడియేషన్ కు దూరంగా ఉండాలంటే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ ను దూరంగా ఉంచి మాట్లాడడం, ఫోన్ లో మాట్లాడడానికి తగ్గించి టెక్స్ట్ మెసేజ్ (Text message) ను ఉపయోగిస్తే మంచిది. అలాగే రేడియేషన్ తక్కువగా ఉండే మంచి సెల్ ఫోన్స్ ను ఉపయోగించడంతోపాటు కొన్ని జాగ్రత్తలను (Precautions) తీసుకుంటే వాటి వాడకంతో కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
మెదడు కణాల వేడి తగ్గాలంటే రోజులో నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని (Water) తాగాలి. అలాగే రోజు తలస్నానం చేయాలి. మెదడు కణాల వేడిని తగ్గించేందుకు ప్రతిరోజు ప్రాణాయామం (Pranayama) చేస్తే మంచి ఫలితాలను పొందగలరు. ఫోన్ వాడకం పెరిగితే జ్ఞాపకశక్తి లోపించడం, దృష్టిలోపం, చికాకు వంటి ఇతర సమస్యలు కలుగుతాయి. కనుక సెల్ ఫోన్స్ ను అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవాలి.