మోచేతుల చర్మం నల్లగా మారిందా అయితే ఈ చిట్కాలను పాటించండి!

Navya G   | Asianet News
Published : Jan 09, 2022, 04:18 PM IST

మోచేయి (Elbow), చంకల్లో (Armpeat) చర్మం నల్లగా మారి ఇష్టమైన స్లీవ్ లెస్ డ్రెస్ లను వేసుకోలేక చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వీటి కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం అంతగా నిరాశ చెందుతున్నారు. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..  

PREV
18
మోచేతుల చర్మం నల్లగా మారిందా అయితే ఈ చిట్కాలను పాటించండి!

ఇలా చర్మం నల్లగా మారడానికి హైపర్ పిగ్మెంటేషన్ (Hyper pigmentation), గాఢత ఎక్కువగా ఉండే డియోడ్రెంట్స్ వాడడం, శుభ్రత పాటించకపోవడం వంటి ముఖ్య కారణాలు కావచ్చు. మెలనీన్ (Melanin) శాతం తగ్గినప్పుడు కూడా బహుమూలల్లో చర్మం నల్లగా మారుతుంది. ఇలాంటి చర్మ సమస్యలు చాలా మంది మహిళల్లో సర్వసాధారణం. వీటిని తగ్గించుకోవడం కోసం సహజసిద్ధమైన ఇంటి చిట్కాలను ప్రయత్నించడం మంచిది.
 

28

నిమ్మ: నిమ్మకాయ (Lemon) సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా చర్మానికి సహాయపడుతుంది. కనుక చర్మం నల్లగా మారిన ప్రదేశంలో నిమ్మరసాన్ని రాసుకొని పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. నిమ్మలోని విటమిన్-సి చర్మకణాలలోని మృతకణాలను (Dead cells) తొలగించి చర్మం నలుపుదనాన్ని తగ్గుతుంది.
 

38

కలబంద: కలబందలో (Aloevera) యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. కలబంద గుజ్జును చర్మం నల్లగా మారిన ప్రదేశంలో అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చర్మాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే క్రమేపీ నలుపుదనం తగ్గుతుంది.
 

48

వంట సోడా: ఒక కప్పులో రెండు స్పూన్ ల వంట సోడా (Baking soda) కొన్ని నీళ్లు (Water)  వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ళు, మోచేతులు, చంకల భాగాలలో రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 

58

కొబ్బరి నూనె: చర్మం నలుపుదనాన్ని తగ్గించడానికి కొబ్బరి నూనె (Coconut oil) సహజసిద్ధమైన బ్యూటీ ప్రోడక్ట్ (Beauty product) గా సహాయపడుతుంది. 
చర్మం నల్లగా మారిన బహుమూలల్లో కొబ్బరి నూనెను రాసుకుని పావుగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే నలుపుదనం తగ్గుతుంది.

68

బంగాళాదుంప రసం: బంగాళాదుంప రసాన్ని (Potato juice) నల్లగా మారిన ప్రదేశంలో సున్నితంగా మసాజ్ (Massage) చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చర్మాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మం నలుపుదనం తగ్గుతుంది. 
 

78

యాపిల్ సిడర్ వెనిగర్: ఒక కప్పులో యాపిల్ సిడర్ వెనిగర్ (Apple cider vinegar), రెండు స్పూన్ ల వంట సోడా (Baking soda) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన చర్మ భాగాలకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మం నలుపుదనం తగ్గుతుంది.
 

88

పెరుగు, నిమ్మరసం, పసుపు, శెనగపిండి: ఒక కప్పులో పెరుగు (Yogurt), నిమ్మరసం (Lemon juice), పసుపు (Turmeric), శెనగపిండిని (Besan) తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, చంక భాగంలో అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ మంచి ఫలితాన్ని అందిస్తుంది.

click me!

Recommended Stories