వయాగ్రా ప్రభావం ఎక్కువ ఉంటే ఏం చెయ్యాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

First Published Oct 7, 2021, 5:05 PM IST

వయాగ్రా అంటే ఒక పిల్స్. ఈ పిల్స్ అనేది పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తం బాగా ప్రసరించేటట్లు చేసి అంగస్తంభన జరగడానికి సహాయపడుతుంది. 

వయాగ్రా అంటే ఒక పిల్స్. ఈ పిల్స్ అనేది పురుషాంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి రక్తం బాగా ప్రసరించేటట్లు చేసి అంగస్తంభన జరగడానికి సహాయపడుతుంది. దీని ప్రభావం కేవలం అంగస్తంభన లేదా సమస్యలు కలిగిన పురుషులు మాత్రమే వేసుకోవాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
 

దీని ప్రభావం ఎక్కువగా ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని ప్రభావం ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ లేదా ఫార్మాసిస్ట్ ను సంప్రదించాలి.
 

ఈ పిల్స్ ను తీసుకున్న వారిలో కొందరికి అంగస్తంభన దాదాపు నాలుగు గంటలపాటు ఉందని తెలిసింది. ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువని.. ఒకవేళ ప్రభావం ఎక్కువ ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలట.
 

చాలావరకు ఈ మందు పనిచేస్తుందని.. కానీ అందరి పై ప్రభావం చూపించవని తెలిసింది. శృంగారంలో పాల్గొనడానికి గంట ముందు ఈ మందులు వేసుకోవాలట. ఆహారంతో తీసుకున్న, తీసుకోకున్నా కూడా ఈ మందు వేసుకోవచ్చట.
 

 ముఖ్యంగా కడుపునిండా ఆహారం తీసుకొని ఈ మందిని వేసుకుంటే మాత్రం దీని ప్రభావం కాస్త ఆలస్యంగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. ద్రాక్ష పళ్లతో ఈ మందును తీసుకోకూడదట.
 

 ఇక ఈ మందులు 50 ఎంజి కంటే ఎక్కువగా  తీసుకోకూడదు అని లేదంటే ప్రమాదమని అంటున్నారు వైద్యులు. ఇక అంగస్తంభన జరిగి చాలాకాలం అయ్యుంటే ఈ మందు పని చేయడానికి కాస్త ఆలస్యం పడుతుందట.
 

 ఇక దీని వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయట. అందులో తలనొప్పి, మత్తుగా ఉండటం, చూపు లోపం, మొఖం వేడెక్కడం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు ఎదురవుతాయట.
 

ముఖ్యంగా ఛాతి నొప్పి, కంటి చూపు కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఎక్కువగా ఉంటే  వెంటనే వైద్యుని సంప్రదించాలని నిపుణులు  తెలుపుతున్నారు.
 

 గుండెకు సంబంధించిన మందులు వాడేవాళ్ళు ఈ మందును తీసుకోకూడదట. రయోసిగువట్, రిటోనేవిర్ అనే మందులు చేసుకునేవాళ్లు, ఏదైనా చికిత్స తీసుకునే వాళ్ళు కూడా ఈ మందును తీసుకోకూడదని వైద్యులు తెలుపుతున్నారు.

click me!