చర్మ సౌందర్యం కోసం మందారం, చామంతి, గులాబి, మల్లె మంచి న్యాచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ (Natural Beauty Products) గా సహాయపడుతాయి. పూలలో ఉండే విటమిన్ సి (Vitamin C) చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పిగ్మెంటేషన్ మచ్చలను దూరం చేస్తాయి. అలాగే వృద్ధాప్య ఛాయలను తగ్గించే మంచి యాంటి ఆక్సిడెంట్స్ గా పనిచేసి ముఖాన్ని మృదువుగా మారుతాయి. సహజసిద్ధమైన క్లెన్సర్ గా పనిచేసి చర్మరంధ్రాలలోని మురికిని తొలగిస్తాయి.