చాక్లెట్స్, స్వీట్స్...
చాలా మందికి నీరసంగా, ఓపికలేనట్లుగా అనిపించినప్పుడు.. వెంటనే నోట్లో చాక్లెట్, లేదంటే స్వీట్స్ వేసుకుంటారు. అవి తిన్నవెంటనే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసినట్లుగా అనిపిస్తుంది. దానిలో చెక్కర.. మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లను విడుదల చేస్తాయి. దీంతో.. వాటిని తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుంది. దీనికి , డిప్రెషన్, నిద్ర లేకపోవడం, పీరియడ్స్, మధుమేహం వంటి వివిధ కారకాలు కావచ్చు. అయితే.. వీటిని తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి... ఎక్కువ ప్రొటీన్లు తినడం, వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల తీపి పదార్ధాల కోరికలను తగ్గించవచ్చు.