ప్రతి రోజు శరీరానికి అందించే ఆహాపు జీవనశైలిలో పోషకాలు తప్పనిసరి. ఈ పోషకాలు శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీర ఆరోగ్యం కోసం పౌష్టికాహారం (Nutrition) ముఖ్యం. కనుక మనం తీసుకునే ఆహారంలో హై ప్రోటీన్స్ కలిగిన పాలకూరను (Spinach) చేర్చుకోవడం మంచిది. పాలకూర పిల్లలకు, పెద్దలకు కావలసిన పోషకాలను, శక్తిని అందిస్తుంది. కనుక ప్రతిరోజూ ఒక కప్పు పాలకూరను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పాలకూరలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలేంటి తెలుసుకుందాం..
పాలకూర ఆకులలో ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ, క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, వంటి ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) కలుగజేస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
210
బరువు తగ్గడానికి మంచిది: బరువు తగ్గాలనుకునే వారికి పాలకూర మంచి ఫలితాన్ని ఇస్తుంది. పాలకూరలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు (Cholesterol levels) ఉండవు. పాలకూరలో ఉండే విటమిన్లు, మినరల్స్, ఫైటో-ట్యూయురెంట్స్ శరీర బరువును తగ్గించడానికి (Weight loss) సహాయపడుతాయి.
310
జ్ఞాపకశక్తిని పెంచుతుంది: పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి మెదడు పనితీరును ఉత్తేజపరుస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని (Memory) పెంచుతాయి. కనుక రోజూ ఒక కప్పు పాలకూరను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
410
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: పాలకూరలో పీచు పదార్థం (Fiber) సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలవిసర్జన సాఫీగా జరిగి మలబద్ధకం (Constipation) సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
510
కంటిచూపును మెరుగు పరుస్తుంది: పాలకూరలో అధిక మొత్తంలో బీటా-కరోటిన్ (Beta-carotene), క్వాతెన్, లుటీన్ (Lutein), విటమిన్-A వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను తగ్గించి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
610
క్యాన్సర్ కు విరుగుడుగా సహాయపడుతుంది: పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయి. పాలకూర క్యాన్సర్ (Cancer) కు విరుగుడుగా (Antidote) పనిచేస్తుంది.
710
గుండె ఆరోగ్యానికి మంచిది: పాలకూరలో మినరల్స్ (Minerals) పుష్కలంగా ఉంటాయి. కనుక పాలకూర గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె సమస్యలన్నిటినీ (Heart problems) తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
810
spinach
ఎముకలను దృఢంగా మారుస్తుంది: పాలకూరలో క్యాల్షియం (Calcium), విటమిన్ కె (Vitamin K) పుష్కలంగా ఉంటాయి. కనుక ఇది ఎముకలకు కావలసిన బలాన్ని అందించి ఎముకలు దృఢంగా మారుస్తుంది.
910
వాపులను నిరోధిస్తుంది: పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, శోథ నిరోధక సమ్మేళనాలు (Anti-inflammatory compounds) సమృద్ధిగా ఉంటాయి. కనుక ఇది శరీరంలో వచ్చే వాపులను (Inflammation) తగ్గించే ఔషదంగా సహాయపడుతుంది.
1010
పైన తెలిపిన అనారోగ్య సమస్యలతో పాటు మధుమేహం (Diabetes), మూత్రపిండాల్లో రాళ్లు (Kidney stones) వంటి సమస్యలను తగ్గించడానికి పాలకూర చక్కగా సహాయపడుతుంది. కాబట్టి రోజు ఒక కప్పు పాలకూరను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.