ఉదయాన్నే లేవడం వల్ల ఇన్ని ఉపయోగాలా..?

First Published May 31, 2021, 2:54 PM IST

ఉదయాన్నే లేవడం వల్ల.. స్వచ్ఛమైన గాలి పీల్చకునే అవకాశం ఉంది. సమయం గడుస్తున్న కొద్ది.. వాహనాల రొదలతో.. వాతావరణం కాలుష్యమౌతుంది

ఈ కాలం పిల్లలు ఉదయం పది అవుతున్నా.. కనీసం బెడ్ మీద నుంచి కిందకు దిగరు. అందులోనూ ప్రస్తుతం కరోనా టైం కావడంతో.. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో బద్దకాలు మరింత పెరిగి.. సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చే వరకు కనీసం నిద్రలేవడం లేదు.
undefined
అయితే.. బారెడు పొద్దెక్కే వరకు పడుకునే వారికంటే.. ఉదయాన్నే లేచేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారట. అంతేకాకుండా ఉదయాన్నే నిద్రలేవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
ఉదయాన్నే లేవడం వల్ల.. స్వచ్ఛమైన గాలి పీల్చకునే అవకాశం ఉంది. సమయం గడుస్తున్న కొద్ది.. వాహనాల రొదలతో.. వాతావరణం కాలుష్యమౌతుంది. కానీ తెల్లవారుజామున గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది పీల్చడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా హాయిగా కూడా ఉంటుంది.
undefined
ఉదయాన్నే లేస్తే.. మనం చేయాల్సిన అన్నీ పనులు ఎలాంటి తొందర లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అంతేకాదు వ్యాయామం చేసుకోవడానికి కూడా సమయం దొరుకుతుంది. అలా ఉదయాన్నే లేచి యోగా, వ్యాయామం లాంటివి చేయడం వల్ల ఆరోగ్యం మన సొంతమౌతుంది. అంతేకాకుండా స్కూల్, కాలేజ్, ఆఫీసులకు సమయానికి వెళ్లే అవకాశం దొరుకుతుంది.
undefined
ఉదయన్నే లేచేవారికి హడావిడిగా పరుగులు పెట్టే పని ఉండదు. ప్రశాంతంగా ఒక దాని తర్వాత మరొకటి.. ఆలోచించి చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి సమయం ఎక్కువగా లభిస్తుంది. ఆ సమయంలో అన్ని పనులు చక్కపెట్టుకోవచ్చు.
undefined
ఉదయాన్నే లేచేవారు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారట. వారి బ్రెయిన్ ఎక్కువ చురుకుగా పనిచేస్తుందట.
undefined
చాలా మంది ఆలస్యంగా నిద్రలేచి.. టైమ్ లేదని ఏదో ఒకటి తిన్నామంటే తిన్నామని అనిపిస్తారు. దాని వల్ల ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది.
undefined
అలాకాకుండా.. ఉదయాన్నే లేవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటారు.
undefined
ఈ మధ్యకాలంలో ఒత్తిడికి గురై అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అయితే.. ఉదయాన్నే లేచేవారిలో ఒత్తిడి చాలా తక్కువకు గురౌతారట. దీంతో.. వారు అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉంటుంది.
undefined
అంతేకాకుండా.. ఉదయాన్నే నిద్రలేచేవారు.. రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమిస్తారు. దాని వల్ల వారికి సరిపడ నిద్ర లభిస్తుంది. హాయిగా త్వరగా నిద్రపోగలుగుతారు.
undefined
click me!