హోలీ ఆడటానికి రెడీ అయ్యారా.? మీ కళ్లు జాగ్రత్త..!

First Published Mar 21, 2024, 3:14 PM IST

చాలా మంది రంగులు పూసుకునేటప్పుడు కళ్లజోడు ఇబ్బందిగా ఉంటుందని.. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటూ ఉంటారు. 

హోలీ అంటేనే రంగుల పండగ. ఈ పండగ ఎవరికైనా సరదాగానే ఉంటుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రంగులు పూసుకుంటూ.. సరదాగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే.. సరదాగా ఈ పండగ ఆడే సమయంలో..  మీ కళ్లను మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. రంగులు కళ్లలోకి వెళ్లి.. ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 

ముందుగా.. మనం ఎంచుకునే రంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే... కెమికల్స్ ఎక్కువగా ఉండే రంగులను ఎంచుకోకపోవడమే మంచిది. వాటి వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హెర్బల్ లేదంటే.. ఆర్గానిక్ కలర్స్ ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ రంగులను ఎంచుకోవడం ఉత్తమం. వాటి వల్ల ఎక్కువ హాని ఉండదు.
 

ముఖానికి ఎలా పడితే అలా రంగులు చల్లుకుంటూ ఉంటాం. ఎలా పడితే అలా రంగులు పూసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కళ్లల్లో పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. కళ్లకు కనీసం కళ్లజోడు అయినా పెట్టుకోవడం ఉత్తమం. దాని వల్ల కళ్లలోకి రంగులు పోకుండా ఉంటాయి.
 

చాలా మంది రంగులు పూసుకునేటప్పుడు కళ్లజోడు ఇబ్బందిగా ఉంటుందని.. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ.. పొరపాటున కూడా హోలీ ఆడేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోకూడదు. ఎందుకంటే.. కాంటాక్ట్ లెన్స్ ఫై కలర్ పడితే.. కంటిలో దురద లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాంటాక్ట్ లెన్స్ కి బదులు గ్లాసెస్ పెట్టుకోవడమే ఉత్తమం.
 


ఒకవేళ పొరపాటున కంట్లో రంగులు పడితే.. వెంటనే నీటితో శుభ్రం చేయాలి. నీటితో కడగడం ఆలస్యం చేస్తే,.. కళ్లు మరింత పాడయ్యే ప్రమాదం ఉంది.  కళ్లు ఎర్రగా మారిపోవడం , ఇన్ఫెక్షన్ రావడం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి. ముందుగానే నీటితో కడగడం ఉత్తమం.

ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా.. రంగులు కంటిలో పడిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో  వెంటనే కళ్లు రుద్ద కూడదు. అలా రుద్దడం వల్ల కళ్లు మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. వాటర్ తో కడగాలి.కానీ పొరపాటున కూడా కంటిని రుద్దవద్దు.

హోలీ ఆడటానికి ముందే.. కంటి చుట్టూ కొబ్బరి నూనె లేదంటే.. పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి. ఇవి రాసుకోవడం వల్ల.. రంగులు కంటి పై పొరపైనే ఆగిపోతాయి. కంట్లో పడే అవకాశం తక్కువగా ఉంటుంది.

Holi

ఇక.. జుట్టు లూస్ గా వదలకూడదు. లూస్ గా వదలడం వల్ల... జుట్టుపై నుంచి రంగులు కంట్లోకి పడే అవకాశం ఉంది. కాబట్టి.. జట్టును లూస్ గా వదిలేయడం కంటే.. టై చేసుకోవడమే ఉత్తమం. దాని వల్ల కంట్లో రంగులు పడకుండా ఉంటాయి.
 

holi 2024 chandra grahan

ఇక.. హోలీ పండగను సరదాగా ఆడుకోవాలి. కానీ.. అగ్రెసివ్ గా ఆడకుండా ఉండాలి. అగ్రెసివ్ మోడ్ లో ఆడటం వల్ల..  తెలీకుండానే ఎక్కడ పడితే అక్కడ రంగులు పడే అవకాశం ఉంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.
 

కంట్లో కి రంగులు పడినప్పుడు.. మనకు మనంగా  సొంత వైద్యం చేసుకోకూడదు. ఏదైనా  ఇరిటేషన్ వస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఈ  జాగ్రత్తలు తీసుకుంటే.. మీ కళ్లు జాగ్రత్తగా ఉంటాయి.

click me!