ఈ బ్లడ్ గ్రూప్ వారికి స్ట్రోక్ ముప్పు ఎక్కువ.. మీది ఏ బ్లడ్ గ్రూప్..

First Published | Mar 20, 2024, 10:46 AM IST

ఓ తాజా అధ్యయనం ప్రకారం.. మన బ్లడ్ గ్రూప్ కు, స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి మధ్య సంబంధం ఉంది. మన బ్లడ్ గ్రూప్ సహాయంతో స్ట్రోక్ రిస్క్ గురించి తెలుసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఏ బ్లడ్ గ్రూప్ వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

మన బ్లడ్ గ్రూప్ కూడా మన గురించి ఎన్నో విషయాలను చెప్తుంది. వీటిలో తాజాగా మన బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం బయటపడింది. ఓ రకం బ్లడ్ గ్రూప్ వాళ్లకు స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం కనుగొంది. అసలు ఏ బ్లడ్ గ్రూప్ వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

అధ్యయనం ఏం చెబుతోంది?

దీనిపై జరిపిన అధ్యయనంలో 16,700 మందికి పైగా స్ట్రోక్ బాధితులు, 600,000 మంది పూర్తి హెల్తీగా ఉన్నవారు పాల్గొన్నారు. ఈ పరిశోధన బ్లడ్ గ్రూప్, ఇస్కీమిక్ స్ట్రోక్ మధ్య జన్యు సంబంధాన్ని పరిశోధించింది.

ఈ వ్యక్తులకు రిస్క్ ఎక్కువ 

ఇతర బ్లడ్ గ్రూప్ వారితో పోలిస్తే 'ఏ' బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి 60 ఏండ్లలోపు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ రక్త రకానికి సంబంధించిన జన్యుపరమైన కారకాలు కొంతమందికి చిన్న వయస్సులోనే స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని ఈ పరిశోధన సూచిస్తుంది.

Latest Videos


stroke

ఈ వ్యక్తులు సేఫ్

ఈ పరిశోధన ప్రకారం.. ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ప్రారంభ స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువ. బ్లడ్ గ్రూప్ ఓ ఇస్కీమిక్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుందని పరిశోధన సూచిస్తుంది. ముఖ్యంగా పెద్దవారికి స్ట్రోక్ వచ్చే రిస్క్ తక్కువగా ఉంది.

ఈ అధ్యయనం బ్లడ్ గ్రూప్ ఏ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపినప్పటికీ.. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరం. స్ట్రోక్ లో రక్త రకం పాత్ర పోషిస్తున్నప్పటికీ, అధిక రక్తపోటు, స్మోకింగ్ వంటి ఇతర ప్రమాద కారకాలు కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని బాగా పెంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
 

అందుకే స్ట్రోక్ రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అధ్యయనం రక్తం రకం,  కొరోనరీ హార్ట్ డిసీజ్, కడుపు క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదం మధ్యనున్న సంబంధాన్ని కూడా కనుగొంది.

click me!